ఏపీలో 4 సీట్లూ వైసీపీవే!… ఆశావ‌హుల జాబితా ఇదే!

ఏపీలో 4 సీట్లూ వైసీపీవే!… ఆశావ‌హుల జాబితా ఇదే!
ఏపీలో ముగియ‌ను‌న్న‌ న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల ప‌ద‌వీకాలం
అసెంబ్లీలో స‌భ్యుల బ‌లాల ఆధారంగా 4 సీట్లూ వైసీపీకే ‌
ఆశావహులు డజన్ కు పైగానే పార్టీ ప‌రిశీల‌న‌లో ఐదుగురు నేత‌లు
విజ‌య‌సాయిరెడ్డి, బీద మ‌స్తాన్ రావు స‌హా మ‌రో ముగ్గురి పేర్ల ప‌రిశీల‌న‌

తెలుగు రాష్ట్రాల‌తో పాటు 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 57 రాజ్య‌స‌భ సీట్ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గురువారం షెడ్యూల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ 57 సీట్ల‌లో 4 సీట్లు ఏపీకి చెందిన‌వి. ఖాళీ కానున్న స్థానాల్లో వైసీపీకి చెందిన ఆ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డితో పాటు బీజేపీ ఎంపీలుగా కొనసాగుతున్న సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేశ్, సురేశ్ ప్ర‌భుల సీట్లు ఉన్నాయి.

అయితే వ‌చ్చే నెల 10 జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో నాలుగు సీట్లు కూడా అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. అసెంబ్లీలో ఆ పార్టీ స‌భ్యుల సంఖ్య ఆధారంగా 4 సీట్లను వైసీపీ గెలవ‌డం ఖాయ‌మే.

ఈ క్ర‌మంలో ఈ సీట్ల‌ను ద‌క్కించుకునేందుకు వైసీపీ నేత‌ల య‌త్నాలు ఇప్పటికే మొద‌ల‌య్యాయి. అందుబాటులో ఉన్నవి 4 సీట్లే అయినా.. సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో రిలియన్స్ అంబానీ మిత్రుడు సీటుకోసమే స్వయంగా అంబానీనే సీఎం జగన్ వద్దకు వచ్చి కలిశారు .ఇందులో ప్రధాని సూచన కూడా జగన్ ఉండి ఉండవచ్చుననే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి. అందువల్ల ఈసారి ఎన్నికలు జరగనున్న నాలుగు సీట్లలో ఆదానీ భార్య కు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో తిరిగి ఆ పేరు ప్రచారం లోకి రావడంలేదు . అయితే తెలంగాణ కు చెందిన బీసీ సంఘం నేత ఆర్ . క్రిష్ణయ్య పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు సినీ హాస్య నటుడు అలీ కి సీటు ఆఫర్ చేశారని ప్రచారం జరిగింది.

పార్టీ కొంద‌రి పేర్ల‌నే ప‌రిశీలిస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. పార్టీ ప‌రిశీలిస్తున్న వారిలో విజ‌య‌సాయిరెడ్డి, బీద మ‌స్తాన్ రావు, ఆర్ కృష్ణ‌య్య‌, నిరంజ‌న్ రెడ్డి, సునీల్ ఉన్నారని అంటున్నారు .అయితే ఇవే గ్యారంటీ అని ఏమి లేదు …

తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీ నుంచి రాజ్యసభ కు పంపే 4 అభ్యర్థులు ఖరారు అయ్యారని వారిలో విజయసాయిరెడ్డి తోపాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రధానికి మోడీకి అత్యంత సన్నిహితుడు అదానీ ఉన్నారని సమాచారం . ఈ ఇద్దరితో పాటు శ్రీకాకుళంకు చెందిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి , నెల్లూరు జిల్లాకు చెందిన బీసీ నేత బీద మస్తాన్ రావు ఉన్నట్లు తెలుస్తుంది. …సీఎం జగన్ ఎవరిని ఎంపిక చేస్తారోననే ఆశక్తి నెలకొన్నది .

Leave a Reply

%d bloggers like this: