Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేరళలో బెంబేలెత్తిస్తున్న టమాటా ఫ్లూ.. లక్షణాలు ఇవే!

కేరళలో బెంబేలెత్తిస్తున్న టమాటా ఫ్లూ.. లక్షణాలు ఇవే!

  • కేరళలోని కొల్లాంలో వెలుగుచూసిన వైరస్
  • ఆసుపత్రి పాలైన 80 మంది చిన్నారులు
  • జ్వరం, నీరసం, జలుబు, దగ్గు, కడుపునొప్పి వంటి లక్షణాలు
  • బాధిత చిన్నారులందరూ ఐదేళ్లలోపు వారే
  • అప్రమత్తమైన పొరుగు రాష్ట్రం తమిళనాడు

కరోనా వైరస్ నుంచి పూర్తిగా బయటపడకముందే ఇప్పుడు టమాటా వైరస్ రూపంలో మరోటి దాడిచేస్తోంది. కేరళలో వెలుగు చూసిన ఈ ఫ్లూ కారణంగా పలువురు చిన్నారులు తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలు, ఇతర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రమాదకర ఈ వైరస్ కారణంగా కొల్లాంలో 80 మంది చిన్నారులు ఆసుపత్రుల పాలయ్యారు. ఈ వైరస్ బారినపడిన చిన్నారుల వయసు ఐదేళ్లలోపు కావడం గమనార్హం.

అత్యంత అరుదైన ఈ వ్యాధి కారణంగా చర్మంపై ఎర్రటి బొబ్బలు వస్తాయి. అవి టమాటా ఆకారంలో ఉండడంతోనే దానికా పేరు పెట్టినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ ఫ్లూ బారినపడిన వారిలో తీవ్రమైన జ్వరం, నీరసంగా అనిపించడం, ఒళ్లు నొప్పులు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే, కొందరు చిన్నారుల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, చేతులు, మోకాళ్లు, పిరుదులు రంగు మారుతాయని చెబుతున్నారు.

ప్రస్తుతం కొల్లాంకే పరిమితమైన ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని కేరళ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కేరళలో ఈ ఫ్లూ వెలుగు చూడడంతో తమిళనాడు అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లోనే పరీక్షలు చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతోపాటు శరీరంలో నీటి స్థాయులు తగ్గకుండా చూసుకోవడం ద్వారా టమాటా వైరస్‌కు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Related posts

సీపీఐ నారాయణ అర్ధాంగి వసుమతి కన్నుమూత!

Drukpadam

మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు!

Drukpadam

తమిళిసై తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్….

Drukpadam

Leave a Comment