తెలంగాణ నుంచి రాజ్యసభ ఛాన్స్ గాయత్రీ రవికి ఉంటుందా ?

తెలంగాణ నుంచి రాజ్యసభ ఛాన్స్ గాయత్రీ రవికి ఉంటుందా ?
మూడు స్థానాల్లో ఎవరెవరు అనేదానిపై నెలకొన్న ఆశక్తి
ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి , తుమ్మల పేర్లు ప్రచారంలోకి
సీఎం మదిలో ఎవరు ఉన్నారనే దానిపై ఆరా
బండ ప్రకాష్ , ధర్మపురి శ్రీనివాస్ ,కెప్టెన్ లక్ష్మి కాంతారావు రాజ్యసభ నుంచి రిటైర్
రిటైర్ అవుతున్న ఇద్దరు బీసీ , ఒక బ్రాహ్మణ

తెలంగాణ నుంచి ముగ్గురిని రాజ్యసభకు పంపాల్సి ఉంది…మూడు సీట్లు టీఆర్ యస్ ఖాతాలోకే పోతాయి. అందువల్ల కేసీఆర్ కరుణ ఎవరి మీద పడుతుంది. అనే ఆశక్తి సర్వత్రా నెలకొన్నది … బీసీ లనుంచి అందులో మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన ధర్మపురి శ్రీనివాస్ స్తానం లో అదే సామాజికవర్గానికి ఇస్తారా ? ఇస్తే ఆ సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థిగా వివాద రహితుడుగా పేరున్న గాయత్రీ రవి అలియాస్ వద్దిరాజు రవిచంద్ర కు ఛాన్స్ తగులుతుంది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆయన ఎంపిక ఉమ్మడి ఖమ్మం , వరంగల్ , జిల్లాలతోపాటు కరీంనగర్ పై కూడా ఉంటుందని అంటున్నారు . చట్టసభలకు వెళ్లాలనే కోరిక బలంగా ఉన్న గాయత్రీ రవికి ఖమ్మం , వరంగల్ జిల్లాల అసెంబ్లీ సీట్లకు పోటీ చేసే స్థానాల్లో ఇప్పటికే టీఆర్ యస్ అభ్యర్థులు ఉన్నారు . అందువల్ల ఆయన్ను రాజ్యసభ లేదా , శాసనమండలికి పంపాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్ , కేటీఆర్ వద్ద కూడా మంచి పేరుంది. వారి లుక్స్ లో రవి ఉన్నారు . ప్రజలకు సేవ చేయాలనే బలమైన కోరిక ఉంది.

ఖమ్మం జిల్లా నుంచి మరో ముగ్గురి పేర్లు తరుచు ప్రచారంలోకి వస్తున్నాయి. వారిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు , హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డి ఉన్నారు . కానీ రకరకాల కారణాల రీత్యా వారికీ ఛాన్స్ తక్కువగానే ఉందని అంటున్నారు .

రిటైర్ అవుతున్న వారిలో ఇప్పటికే మధ్యలోనే పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా చేసిన బండ ప్రకాష్ , ఫుల్ టర్మ్ పూర్తీ చేసుకొని రిటైర్ అవుతున్న ధర్మపురి శ్రీనివాస్ , కెప్టెన్ లక్ష్మి కాంతారావు ఉన్నారు . బండ ప్రకాష్ పదవి కాలం మరో మూడు సంత్సరాలు మాత్రమే ఉంది. అందువల్ల దానికి ఎంపిక చేయబడే అభ్యర్థి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటారు . మిగతా ఇద్దరు ఆరు సంవత్సరాలు ఉంటారు . అందువల్ల ఈ ఖాళీలకు సీఎం కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారనే ఆశక్తి సర్వత్రా నెలకొన్నది . చూద్దాం ఏమి జరుగుతుందో !

 

Leave a Reply

%d bloggers like this: