గుడ్ లక్, గుడ్ బై.. కాంగ్రెస్ కు షాకిచ్చిన సీనియర్ నేత.. రాహుల్ కు వార్నింగ్!

గుడ్ లక్, గుడ్ బై.. కాంగ్రెస్ కు షాకిచ్చిన సీనియర్ నేత.. రాహుల్ కు వార్నింగ్!
-పార్టీకి సునీల్ జకార్ రాజీనామా
-ఢిల్లీలో కూర్చున్న వాళ్ల వల్లే అధోగతిపాలని వ్యాఖ్య
-సైకోపాత్ ల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ రాహుల్ కు సూచన

కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పంజాబ్ మాజీ చీఫ్ సునీల్ జకార్ పార్టీకి రాజీనామా చేశారు. పోతూపోతూ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపిస్తూనే వార్నింగ్ ఇచ్చారు. సైకోపాత్ లకు దూరంగా ఉండాలని రాహుల్ కు సూచించారు. ‘గుడ్ లక్ , గుడ్ బై కాంగ్రెస్’ అంటూ పార్టీకి వీడ్కోలు చెప్పారు. ఇవాళ ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు.

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చింతన్ శిబిర్ జరుగుతున్న సమయంలోనే పార్టీ సీనియర్ నేత రాజీనామా చేయడం పార్టీకి పెద్ద షాక్. ఢిల్లీలో కూర్చున్న వాళ్లే పంజాబ్ లో పార్టీని అధోగతి పట్టించారన్నారు. ఎంపీ అంబికా సోని వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పంజాబ్ లో హిందూ ముఖ్యమంత్రిని పెడితే దు:ఖాన్ని కొని తెచ్చుకున్నట్టేనన్న ఆమె వ్యాఖ్యలు సరికాదన్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ వల్ల కూడా పార్టీ ఓడిపోయిందన్నారు.

సునీల్ జక్కర్ రాజీనామాతో పంజాబ్ లో అసలే ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ కు మరింత నష్టం జరిగిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతకు ముందు నవజోత్ సింగ్ సిద్దు ను పార్టీ ఓటమి అనంతరం పార్టీ అధిష్టానం రాజీనామా చేయమని కోరిన సంగతి తెలిసిందే . కెప్టెన్ అమరిందర్ సింగ్ ను సీఎం పీఠం నుంచి దించిన తరువాత చన్నీ ను సీఎం గా చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చన్నీ వల్లనే పార్టీ ఓడిందని జక్కర్ అంటున్నారు . కాంగ్రెస్ అధిష్టానం చింతన్ బైఠక్ లో చేస్తున్న కసరత్తు పార్టీని నిలబెట్టేందుకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి …

Leave a Reply

%d bloggers like this: