జగన్ నిర్ణయానికి ఎదురు తిరిగిన వైసీపీ కౌన్సిలర్!

జగన్ నిర్ణయానికి ఎదురు తిరిగిన వైసీపీ కౌన్సిలర్!

  • గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన జగన్ ప్రభుత్వం
  • వైసీపీ నేతలను పలుచోట్ల నిలదీసిన ప్రజలు
  • హామీలు నెరవేర్చకుండా జనాల్లోకి ఎలా వెళ్లాలన్న వైసీపీ కౌన్సిలర్

ఏపీ సీఎం జగన్ ‘గడప గడపకు ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సి ఉంటుంది.

అయితే, కొన్ని చోట్ల ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి నిరసన ఎదురవుతోంది. తమ వద్దకు వస్తున్న ప్రజాప్రతినిధులను పలు చోట్ల ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు సొంత పార్టీలోనే వైసీపీకి వ్యతిరేకత ఎదురయింది.

గడప గడపకు ప్రభుత్వం నిర్ణయంపై బొబ్బిలి వైసీపీ కౌన్సిలర్ రామారావు నాయుడు మండిపడ్డారు. అభివృద్ధి జరగకుండానే గడప గడపకు ఎలా వెళ్లగలనని ప్రశ్నించారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదని… ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్లగలమని ప్రశ్నించారు. ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

%d bloggers like this: