ఓటు బ్యాంకు లేని పవన్ కళ్యాణ్… అమిత్ షా వద్ద కె ఏ పాల్!

ఓటు బ్యాంకు లేని పవన్ కళ్యాణ్… అమిత్ షా వద్ద కె ఏ పాల్!
కాంగ్రెస్ పార్టీ పనైపోయింది.. ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది తామే అంటున్న కేఏ పాల్
ఒక్క హైదరాబాద్ మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాలు తమవేనన్న పాల్
దక్షిణ భారత రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టీకరణ
పవనే తమ వెంట పడుతున్నారని షా చెప్పారన్న ప్రజాశాంతి పార్టీ చీఫ్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ఏది మాట్లాడిన సంచలనమే …తెలంగాణ లో కేసీఆర్ పని అయిపోయిందని తానే ఇక్కడ ప్రత్యాన్మాయం అని చెప్పిన పాల్ ,ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసి వచ్చిన తరవాత ఏపీ లో బీజేపీ ,జనసేన కు ఎలాంటి ఓటు బ్యాంకు లేదని , ఓటు బ్యాంకు లేని జనసేన వెంట ఎందుకు పడుతున్నారనని అమిత్ షా ను అడిగితె తాము ఆయన వెంట పడటంలేదని ఆయన తమ వెంటపడుతున్నారని అమిత్ షా పేర్కొన్నట్లు కె .ఏ పాల్ తెలిపారు . అమిత్ షా నిజంగా ఎలా అని ఉంటె పవన్ కళ్యాణ్ కు ఇది అవమానమే …

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంకు లేదని అమిత్ షాతో భేటీ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఓటు బ్యాంకు లేని పవన్ కల్యాణ్ వెంట ఎందుకు పడుతున్నారని అమిత్ షాను ప్రశ్నించినట్టు చెప్పారు. దానికి మంత్రి మాట్లాడుతూ.. తాము ఆయన వెంట పడలేదని, ఆయనే తమ వెంట పడుతున్నారని చెప్పారని పాల్ అన్నారు.

దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేసేది తామేనని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా ఏపీ, తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారత రాష్ట్రాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.

 

Leave a Reply

%d bloggers like this: