తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరాలి ….బీజేపీ అగ్రనేత అమిత్ షా!

తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరాలి ….బీజేపీ అగ్రనేత అమిత్ షా!
బీజేపీ తెలంగాణ కోర్ క‌మిటీకి అమిత్ షా పలు సూచ‌న‌లు
టీఆర్ఎస్ విమ‌ర్శ‌ల‌ను గ‌ట్టిగా తిప్పికొట్టండి
శంషాబాద్‌లో కోర్ క‌మిటీ నేత‌లతో అమిత్ షా భేటీ
ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని సూచ‌న‌
నేత‌ల‌పై అంత‌ర్గత నివేదిక‌ను ప్ర‌స్తావించిన అమిత్ షా

తెలంగాణాలో బీజేపీ జెండా ఎగరాలి . అందుకు నాయకులందరు కలిసి కట్టుగా పని చేయాలి … మనకు మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి …మీకు ఏమికావాలన్న కేంద్రం అండగా ఉంటుంది. ఎన్నిసార్లు రావాలన్న ఇక్కడకు వస్తాం మీరు చేయాలిసింది. ప్రజలను కలవండి బీజేపీ విధానాలు కేంద్రం అందిస్తున్న పథకాలు , రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని గురించి అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని సరైన సమయంలో బయటకు తీస్తామని కూడా చెప్పినట్లు తెలిసింది.

కేంద్ర ప్ర‌భుత్వంపై టీఆర్ఎస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను గట్టిగా తిప్పికొట్టాల‌ని బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ తెలంగాణ కోర్ క‌మిటీ నేత‌ల‌కు సూచించారు. బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర ముగింపు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా కాసేపటి క్రితం శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో పార్టీ తెలంగాణ కోర్ క‌మిటీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.

అరగంట పాటు సాగిన ఈ భేటీలో పార్టీ తెలంగాణ శాఖ‌కు అమిత్ షా ప‌లు సూచన‌లు చేశారు. వ‌చ్చే ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని ఆయ‌న పార్టీ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లకు సంబంధించి అంత‌ర్గ‌తంగా రూపొందించిన ఓ నివేదిక‌ను ప్ర‌స్తావిస్తూ అమిత్ షా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. కోర్ క‌మిటీ భేటీని ముగించుకున్న అమిత్ షా తుక్కుగూడ‌లో జ‌ర‌గ‌నున్న బండి సంజయ్ పాద‌యాత్ర ముగింపు స‌మావేశానికి వెళ్ల‌నున్నారు.

Leave a Reply

%d bloggers like this: