సాయి గణేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన బండి సంజయ్ ….

సాయి గణేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన బండి సంజయ్ ….
గణేష్ మరణానికి కారణమైన వారికీ శిక్ష పడేలా చేస్తాం ….

ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల అరాచకాలు, పోలీసుల వేధింపులతో ప్రాణాలు కోల్పోయిన బిజెపి కార్యకర్త సాయి గణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సాయి గణేష్ కుటుంబ సభ్యుల్ని కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంలో, సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మ విలపిస్తూ,.. స్థానిక మంత్రి, పోలీసులు తన మనవడిపై 16 అక్రమ కేసులు పెట్టడంతో పాటు రౌడీషీట్ ఓపెన్ చేశారంటూ వాపోయారు. సావిత్రమ్మను ఓదార్చి, సాయి గణేష్ మరణానికి కారకులైన వారికి శిక్షపడే వరకు పోరాడతామని భరోసా కల్పించడం జరిగింది.

అనంతరం బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గళ్ళ సత్యనారాయణ , బిజెపి రాష్ట్ర, స్థానిక నేతల సహకారంతో కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన దస్తావేజులను సాయిగణేష్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. అదేవిధంగా సాయిగణేష్ ఆత్మహత్య ఘటన విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ హిందూవాహిని జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ ను బండి సంజయ్ పరామర్శించారు .

Leave a Reply

%d bloggers like this: