Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు… తన ఉద్యోగులకు నెట్ ఫ్లిక్స్ సూచన!

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు… తన ఉద్యోగులకు నెట్ ఫ్లిక్స్ సూచన!
-ప్రముఖ ఓటీటీగా రాణిస్తున్న నెట్ ఫ్లిక్స్
-ఏడేళ్ల తర్వాత తొలిసారి మార్గదర్శకాల సవరణ
-ఉద్యోగులకు వర్తించేలా మార్గదర్శకాలు

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ఏడేళ్ల తర్వాత తన మార్గదర్శకాలను సవరించింది. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కూడా వర్తించేలా నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం తాజా మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమకు నచ్చని కంటెంట్ పైనా పనిచేయాల్సి ఉంటుందని, ఒకవేళ వారు ఆ కంటెంట్ పై పనిచేయలేమని భావిస్తే, సంస్థ నుంచి నిరభ్యంతరంగా నిష్క్రమించవచ్చని నెట్ ఫ్లిక్స్ స్పష్టం చేసింది.

“మీ విధులను బట్టి మీరు పలు రకాల కంటెంట్ టైటిళ్లపై పనిచేయాల్సి ఉంటుంది. అవి హానికరమని మీరు భావించినప్పటికీ మీ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మీరు ఆ విధంగా మద్దతు ఇవ్వలేమని భావిస్తే నెట్ ఫ్లిక్స్ ఇక ఎంతమాత్రం మీకు ఉత్తమమైన ప్రదేశం కాకపోవచ్చు” అని ఓ మెమోలో నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది.

అంతేకాదు, తమ నుంచి ఎలాంటి కార్యక్రమాలను కోరుకుంటున్నారో నిర్ణయించే వెసులుబాటును వీక్షకులకు కల్పించింది. అందుకోసం ‘కళాత్మక వ్యక్తీకరణ’ (ఆర్టిస్టిక్ ఎక్స్ ప్రెషన్) అనే విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. ప్రత్యేకించి కొందరు కళాకారులను, వివిధ రకాల కంటెంట్ ను సెన్సార్ చేసే వీలు కూడా ఉంటుందని నెట్ ఫ్లిక్స్ పేర్కొంది.

ఇక, కొన్ని కార్యక్రమాల టైటిళ్లు తమ సొంత విలువలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, కంటెంట్ పరంగా వైవిధ్యానికి పెద్దపీట వేయాలని కోరుకుంటున్నామని వివరించింది.

Related posts

 కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. లోక్ సభ స్పీకర్ కు నోటీసులు

Ram Narayana

ఏపీ శాసనమండలి ప్రొటెం స్పీకర్ గా విఠపు బాలసుబ్రహ్మణ్యం… గవర్నర్ ఆమోదం…

Drukpadam

వినాయకుడి లడ్డు ధర 60 .8 లక్షలు …రికార్డు లను చెరిపేసి రిచ్ మండి విల్లాస్!

Drukpadam

Leave a Comment