మీడియా ప్ర‌తినిధికి వైసీపీ ఎమ్మెల్యే అవంతి బెదిరింపు!

మీడియా ప్ర‌తినిధికి వైసీపీ ఎమ్మెల్యే అవంతి బెదిరింపు!

  • కోరాడ‌లో రైతు భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం
  • ఏం ప‌ని చేస్తున్నావ‌య్యా అంటూ ఎస్సైపై అవంతి అస‌హ‌నం
  • సోష‌ల్ మీడియాలో సదరు ఘటన వీడియో వైర‌ల్‌  

వైసీపీ కీల‌క నేత‌, ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ఓ మీడియా ప్ర‌తినిధిని బెదించిన ఘ‌ట‌న సోమ‌వారం చోటుచేసుకుంది. నీ సంగతి చూస్తానంటూ వేలు చూపించి మ‌రీ ఆయ‌న మీడియా ప్ర‌తినిధిని బెదిరించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే… భీమిలి ప‌రిధిలోని ప‌ద్మ‌నాభం మండ‌లం కోరాడ‌లో సోమ‌వారం రైతు భ‌రోసా నిధుల విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అధికార పార్టీ ఎమ్మెల్యేగా హాజ‌రైన అవంతి… మీడియా ప్ర‌తినిధుల‌తో పాటు పోలీసు సిబ్బందిపైనా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. డ్యూటీలో ఉన్న ఓ ఎస్సైని ప‌ట్టుకుని ఏం ప‌ని చేస్తున్నావ‌య్యా అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఆ త‌ర్వాత కార్యక్ర‌మాన్ని క‌వ‌ర్ చేసేందుకు వ‌చ్చిన ఓ మీడియా ప్ర‌తినిధిని ఆయ‌న బెదిరించారు.

Leave a Reply

%d bloggers like this: