Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటికి రాజ్యసభ ఆఫర్ …నేడు కేటీఆర్ తో భేటీ అయిన పొంగులేటి!

పొంగులేటికి రాజ్యసభ ఆఫర్నేడు కేటీఆర్ తో భేటీ అయిన పొంగులేటి!
రాజ్యసభ నా …? ఎన్నికల్లో పోటీనా …?? తేల్చుకోలేక పోతున్న పొంగులేటి 
ఆరేళ్ళ రాజ్యసభ కు వెళ్లాలని కేటీఆర్ సూచన
సందిగ్ధంలో పడ్డ పొంగులేటి

ఖమ్మం మాజీ ఎంపీ టీఆర్ యస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కేసీఆర్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చనట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం …2014 లో వైసీపీ తరుపున ఎంపీ గా గెలిచినా శ్రీనివాస్ రెడ్డి ని సామజిక సమీకరణాల్లో భాగంగా ఎంపీ సీటు నామా కు కేటాయించడంతో గత మూడు సంవత్సరాలుగా ఎలాంటి పదవి లేకుండా ఉన్నారు . ఇటీవల కాలంలో పార్టీ మారుతున్నాడంటూ వార్తలు తరుచు చక్కర్లు కొడుతున్నాయి. అయన అనేక సార్లు తాను పార్టీ మారడంలేదని కేటీఆర్ పై నమ్మకం ఉందని ఆయనపైనే భారం వేశానని చెప్పినప్పటికీ అవి ఆగడంలేదు . ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ కేటీఆర్ నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించి రాజ్యసభ సీటు ను ఆఫర్ చేశారు . రాజ్యసభ సీటు కూడా బండ ప్రకాష్ రాజీనామా చేసింది కాకుండా ఖాళీ అవుతున్న మరో రెండు స్థానాల్లో ఒకటి ఇచ్చేందుకు సిద్ధమైయ్యారని సమాచారం …దీనిపై పొంగులేటి ఎటు తేల్చుకోలేక పోతున్నారని సమాచారం …రాజ్యసభకు వెళ్లాలా ? ఎన్నికల్లో పోటీచేయాలా ?? అనే విషయం పొంగులేటి తేల్చుకోలేక పోతున్నారు . ఆలోచించుకొని చెప్పాలని కేటీఆర్ సూచించినట్లు సమాచారం … దీనిపై సంఘర్షణలో పొంగులేటి ఉన్నారు …

ఖమ్మం జిల్లాలో 2023 ఎన్నికల్లో కూడా టీఆర్ యస్ కు ప్రతికూల ఫలితాలు ఉంటాయని సర్వే లలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా జిల్లాలో బలమైన నేత ప్రజలతో కలిసి పోయేవాడుగా పేరున్న శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోనే కొనసాగేలా చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. శ్రీనివాస్ రెడ్డి పట్ల కేసీఆర్ కొంత గుర్రుగానే ఉన్నా కేటీఆర్ నచ్చచెప్పి పొంగులేటిని టీఆర్ యస్ లోనే కొనసాగేలా చూడాలని పట్టుదలతో ఉన్నారు . అందులో భాగంగానే నిత్యం పొంగులేటి తో సత్సబంధాలను కొనసాగిస్తున్నారు . ఇటీవల ఒక కార్యక్రమంలో కేటీఆర్ పొంగులేటిని స్వయంగా కేసీఆర్ దగ్గరకు తీసుకోని పోయినట్లు ప్రచారం జరిగింది.

ఖమ్మం జిల్లాలో పార్టీని పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చిన కేటీఆర్ బలమైన నేతలను పార్టీ వీడ కుండా చూడాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు . ఇక్కడ నేతలకు ఒకరంటే ఒకరికి గిట్టకపోయిన అందరితో సంబంధాలు కలిగి ఉండటం ద్వారా 2023 ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని చూస్తున్నారు . ఇంటలిజన్స్ నివేదికలు ,సర్వే లద్వారా ఖమ్మం పరిస్థితులను సమగ్రంగా ఆకళింపు చేసుకున్న కేటీఆర్ పొంగులేటికి సీటు ఇవ్వడం ద్వారా ఆయనకు కొన్ని భాద్యతలు అప్పగించి ఫలితాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.పొంగులేటి ఎన్నికల్లో పోటీ చేయాలనీ అందులో శాసనసభ కు పోటీ చేయాలనే ఆశక్తిగా ఉన్నారు . ఆయనకు రాజ్యసభ ఇష్టం లేకపోయినా నచ్చచెప్పడం ద్వారా రాజ్యసభకు పంపాలనే యోచనలో టీఆర్ యస్ అధిష్టానం ఉంది . మరి ఇప్పుడు బాల్ పొంగులేటి కోర్టులో ఉంది. మరి పొంగులేటి గోల్ కొడతారా? లేక గోల్ పోస్ట్ పైకి కొడతారా ?? పక్కకి కొడతారా??? చూడాలి మరి!

Related posts

ఇది ఈటల రాజేందర్ గెలుపు.. బీజేపీ గెలుపు కాదు: పొన్నం ప్రభాకర్!

Drukpadam

అందులో నిజం లేదు …టీడీపీ లో చేరిక పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన!

Drukpadam

పార్లమెంట్ లో పెగాసస్ మంటలు …గందరగోళం స్పీకర్ ఆగ్రహం!

Drukpadam

Leave a Comment