‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌’ సహా మూడు మాల్స్ కు బాంబు బెదిరింపులు!

‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌’ సహా మూడు మాల్స్ కు బాంబు బెదిరింపులు!
-3 షాపింగ్ మాల్స్‌కు బాంబు బెదిరింపులు
-రెండు గంట‌ల‌కు పైగా త‌నిఖీలు చేప‌ట్టిన పోలీసులు
-ఆక‌తాయి ప‌నిగానే నిర్ధారణ‌
-పోలీసుల అదుపులో నిందితుడు

వ‌స్త్ర వ్యాపారంలో ప్ర‌ముఖ సంస్థ‌గా ఎదిగిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స‌హా అదే రంగంలోని మ‌రో రెండు సంస్థ‌లు మాంగ‌ళ్య‌, వీఆర్‌కే సిల్క్స్ మాల్‌ల‌కు సోమ‌వారం బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. క‌రీంన‌గ‌ర్‌లోని ఈ సంస్థ‌ల షాపింగ్ మాల్స్‌లో బాంబులు పెట్టిన‌ట్లు ఓ వ్యక్తి ఆయా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు ఫోన్ చేశాడు. ఈ మాట విన్నంత‌నే వ‌ణికిపోయిన ఆ సంస్థ‌ల ప్ర‌తినిధులు షాప్ లనుంచి ఖాళీ చేసి పోలీసుల‌కు స‌మాచారం అందించాయి.

బాంబు బెదిరింపుల వార్త‌ల‌తో మూడు షాపింగ్ మాల్స్‌లో డాగ్ స్క్వాడ్‌ల‌తో పోలీసులు సోదాలు చేప‌ట్టారు. ఇది నగరంలో కలకలం లేపింది.ఏమి జరుగుతుందనేది ఎవరికీ అర్థం కాలేదు .. పోలీసులు జాగిలాలతో వచ్చి మొత్తం షాప్ లను జల్లాడ పట్టారు .అడుగడుగు క్షుణంగా పరిశీలించారు దాదాపుగా రెండు గంట‌ల‌కు పైగా త‌నిఖీలు చేసినా ఎలాంటి బాంబులు క‌నిపించ‌లేదు. దీంతో ఈ బెదిరింపులు ఆక‌తాయిల ప‌నేన‌ని పోలీసులు తేల్చారు. ఆ త‌ర్వాత నిందితుడి చేసిన ఫోన్ ఆధారంగా అత‌డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

%d bloggers like this: