ఖమ్మంలో టెన్షన్.. ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త!

ఖమ్మంలో టెన్షన్.. ఆత్మహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త!
-సీఎం కేసీఆర్ , మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మల దహనానికి ప్రయత్నం
-అడ్డుకున్న పోలీసులు …బీజేపీ కార్యకర్తలకు , పోలీసులకు మధ్య తోపులాట
-తీవ్ర ఉద్రిక్తతల మధ్య దిష్టిబొమ్మలా దహనం

ఖమ్మంలో బీజేపీ ఆధ్వరంలో మంగళవారం స్థానిక జడ్పీ సెంటర్ లోని అంబేత్కర్ విగ్రహం వద్ద బీజేపీ కార్యకర్తలు సీఎం ,కేసీఆర్ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు . నిన్న టీఆర్ యస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేయడాన్ని నిరసిస్తూ తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు . విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , బీజేపీ జిల్లా అధ్యక్షడు గల్లా సత్యనారాయణల ఆధ్వరంలో దిష్టి బొమ్మలను తగలబెట్టేందుకు ప్రయత్నించిన సందర్భంలో పోలీసులకు ,బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం , తోపులాట జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ యుమోర్ఛాకు చెందిన అనంతుల ఉపేందర్ గౌడ్ అనే యువకుడు , పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు .

దీన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు . పోలీసులు , బీజేపీ కార్యకర్తలు సమయోచితంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు . పెట్రోల్ పోసుకున్న కార్యకర్త వంటిపై నెల్ల క్యాన్ తెచ్చి నెత్తిమీద వంటి మీద పోశారు . అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ నిన్న తమ రాష్ట్ర అధ్యక్షుడిని అనుచిత మాటలు అనడమే కాకుండా దిష్టి బొమ్మ తగలబెడితే చూస్తూ ఊరుకున్నా పోలీసులు ఈ రోజు తమను అడ్డుకోవడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు . ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి ఒకరకంగా ప్రతిపక్షాలకు మరోరకంగా చూడటం సరికాదని అన్నారు .

 

Leave a Reply

%d bloggers like this: