Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తీన్మార్ మల్లన్నపై 10కోట్లకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప‌రువు న‌ష్టం దావా!

తీన్మార్ మల్లన్నపై 10కోట్లకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప‌రువు న‌ష్టం దావా!

చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు న‌ష్టం దావా వేశారు. ఈ మేర‌కు త‌న న్యాయ‌వాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు.

మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయ‌న‌పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసి ప్ర‌చారం పొందాల‌నే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబ‌ద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయ‌వాది పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి చెందిన మల్లన్న దుర్బుద్ధితో, జర్నలిస్ట్ గా చెలామణి అవుతూ జర్నలిజం లో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యపు ప్రచారం చేశారని న్యాయ‌వాది పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప‌రువుకు భంగం క‌లిగించేలా, అస‌త్య‌పూరిత ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న.. సివిల్, క్రిమిన‌ల్ చ‌ట్టాల ప్ర‌కారం మంత్రికి 10 కోట్లు ప‌రిహారం చెల్లించాల‌ని పేర్కొన్నారు. వీటితో పాటు చ‌ట్ట ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌ల‌కు అర్హుల‌వుతార‌ని నోటీసుల్లో న్యాయ‌వాది తెలిపారు. 7 రోజుల్లో తన క్లైంట్ మంత్రి పువ్వాడ అజయ్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాల‌ని న్యాయ‌వాది డిమాండ్ చేశారు.

మతిలేని మల్లన్న.. నాలుక చీరేస్తం..సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్

 

 

తీన్మార్ మల్లన్న సైకో మాదిరిగా మతిలేని మాటలు మాట్లాడితే నాలుక చీరేస్తామని సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకున్న చట్టపరమైన చర్యలతో పగటి వేషగాళ్ల పక్క తడుస్తుందన్నారు.

మంత్రి పువ్వాడ పులి లాంటి వారని, పులితోక పట్టుకొని గిచ్చాలని చూస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. బద్మాష్ పనులు చేసే మల్లన్నకు బదులు చెప్పడంలో పువ్వాడ అజయ్ సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. జర్నలిజంను ఎర్నలిజంగా మార్చి దోపిడీలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ నాయకత్వంలో ఖమ్మం ప్రజలు జీవితాలను బాగుచేసుకొంటుంటే కండ్లు కుట్టిన తీన్మార్ మల్లన్న వంటి వారు మంత్రి మీద అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయనను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సుడా చైర్మన్ విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.

Related posts

రూపాయి విలువ ఢమాల్ … డాలర్ కు రూ.78.83కి పతనం!

Drukpadam

తమిళనాడు జాలర్ల వలకు చిక్కిన రూ.50 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్!

Drukpadam

10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపే యోచనలో అమెజాన్!

Drukpadam

Leave a Comment