ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్సన్ ఎత్తి వేత …

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్సన్ ఎత్తి వేత …
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆయనకు సూచించిన ప్రభుత్వం, ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావుకు జీతభత్యాలను ఇవ్వాలని జీఏడీకి ఆదేశాలు జారీ చేసింది.
ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ఎత్తివేసి, వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపద్యంలో సియస్ ఈ మెరకు ఆదేశాలు జారీ చేసారు . ఆయనకు చెల్లించాల్సిన జీతాన్ని కూడా చెల్లించాలని, సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీసు కింద పరిగణించాలని ఆదేశించారు.
ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ ఉండకూడడు. రెండేళ్లకు మించితే సస్పెన్షన్ ముగిసినట్టే భావించాల్సి ఉంటుంది. ఈ నిబంధన మేరకే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వదంతో, ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ను ఎత్తివేసింది
అంతకు ముందు, రెండు సార్లు ఏబీవీ, చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి సుప్రీంకోర్టు ఆదేశాలను అందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనను విధుల్లోకి తీసుకోవాలని ఏబీవీ సియస్ ను కోరారు.

Leave a Reply

%d bloggers like this: