జగన్ పై తనకు పూర్తీ విశ్వాసం …ఏ పని అప్పగించిన చేస్తా :సినీ నటుడు అలీ!

జగన్ పై తనకు పూర్తీ విశ్వాసం …ఏ పని అప్పగించిన చేస్తా :సినీ నటుడు అలీ
-రాజ్యసభ టికెట్ రాకపోవడంపై స్పందన
-రాజ్యసభ సీటును తాను ఆశించలేదన్న అలీ
-జగన్ దృష్టిలో తాను ఉన్నానని వ్యాఖ్య
-ఏదో ఒక రోజు జగన్ నుంచి పిలుపు వస్తుందన్న అలీ

ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాల్లో బాగా వినిపించిన పేర్లలో సినీ నటుడు అలీ పేరు ఒకటి. అలీని జగన్ రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. జగన్ కూడా అలీని పిలిపించుకుని మాట్లాడటం తెలిసిందే. ఆ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన వస్తుందని చెప్పారు. దీంతో, పెద్దల సభకు ఆయన వెళ్లడం ఖాయమని అందరూ భావించారు. కానీ, నిన్న విడుదల చేసిన వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో అలీ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. రాజ్యసభ సీటును తాను ఆశించలేదని చెప్పారు. జగన్ దృష్టిలో తాను ఉన్నానని… తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా బాధ్యతగా నిర్వర్తిస్తానని అన్నారు. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ గట్టిగా చెప్పలేదని… అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారని… తనకు కూడా ఆ నమ్మకం ఉందని చెప్పారు. వక్ఫ్ బోర్డు పదవి కూడా తనకు ఇవ్వలేదని… ఇప్పటికే దాన్ని ఇతరులకు కేటాయించారని అన్నారు. ఏదో ఒక రోజు జగన్ నుంచి పిలుపు వస్తుందని అలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

%d bloggers like this: