పద్మశ్రీ వనజీవి రామయ్యకు రోడ్ ప్రమాదం….

పద్మశ్రీ వనజీవి రామయ్య కు రోడ్ ప్రమాదం
హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
ఖమ్మం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

పద్మశ్రీ వనజీవి రామయ్య ఈ ఉదయo రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డి గూడెంలోని తన ఇంటి నుంచి.. ఉదయం మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్పై వెల్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొంది. రోడ్డు దాటుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో కిందపడిన రామయ్య కాలుకు తీవ్ర గాయమైంది. సమాచారం తెలుసుకున్న రామయ్య కుటుంబసభ్యులు, వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఎంపీ సంతోష కుమార్ , రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కూడా రామయ్య కు మైరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరెంటెండెంట్ ను ఆదేశించారు .

Leave a Reply

%d bloggers like this: