ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఎంపీ నామ ఘ‌న‌స్వాగతం

ఢిల్లీ లో కేసీఆర్ కు నామా స్వాగతం

జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బ‌య‌లుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సందర్భంగా అక్కడ విమానాశ్రయంలో టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆయ‌న నేతృత్వంలో టీఆర్.ఎస్ ఎంపీలు సీఎంకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సీఎం పరామర్శించనున్నారు.

Leave a Reply

%d bloggers like this: