అమెరికాలో ఎన్టీఆర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ నుంచి పూలవ‌ర్షం..

అమెరికాలో ఎన్టీఆర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ నుంచి పూలవ‌ర్షం..
అమెరికాలోని బోస్టన్ లో టీడీపీ మ‌హానాడు
పాల్గొన్న‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, త‌దిత‌రులు
వీడియో పోస్ట్ చేసిన బుచ్చ‌య్య చౌద‌రి

అమెరికాలోని బోస్టన్ లో టీడీపీ మ‌హానాడు నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ నుంచి అక్క‌డి టీడీపీ అభిమానులు పూలవ‌ర్షం కురిపించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి వీడియో పోస్ట్ చేశారు. ఈ మ‌హానాడులో ఆయ‌న కూడా పాల్గొన్నారు. అమెరికాలో తెలుగు వారు ఇప్పటికి ఎన్టీఆర్ పై అభిమానం తో ఆయన జయంతి , వర్ధనతి జరుపుకుంటారు . అందువల్ల మహానాడు సందర్భంగా అందరిని ఆకర్షించేందుకు హెలికాఫ్టర్ ద్వారా పూలు చెల్లించారు .

‘అమెరికాలోని బోస్టన్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు సంబరాల్లో, హెలికాప్టర్లో అన్న గారి విగ్రహం మీద పూలు చల్లుతూ భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది’ అని గోరంట్ల చెప్పారు.

ఈ సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనమండలి సభ్యుడు మంతెన సత్యనారాయణ రాజు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి, గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: