నోరు తిరగని మరో కొత్త పదాన్ని తెరపైకి తెచ్చిన శశి థరూర్!

నోరు తిరగని మరో కొత్త పదాన్ని తెరపైకి తెచ్చిన శశి థరూర్!
ఆంగ్లంలో అపార జ్ఞానం కలిగిన శశి థరూర్
ఇప్పటికే పలు కొత్త పదాలను పరిచయం చేసిన ఎంపీ
తాజాగా quomodocunquize పద ప్రయోగం
రైల్వేశాఖ ను విమర్శిస్తూ ట్వీట్

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు ఆంగ్ల భాషపై ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలకడానికి ఎంతో కష్టంగా ఉండే పలు పదాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. అలాంటి పదాలు ఇంగ్లీషులో ఉన్నాయని తెలియని చాలామంది శశి థరూర్ పరిజ్ఞానం పట్ల విస్మయం చెందుతుంటారు. శశి థరూర్ వివిధ అంశాల పట్ల స్పందించే సమయంలో ఈ కొత్త పదాలను ప్రయోగిస్తుంటారు.

తాజాగా, ఆయన ఇలాంటిదే మరో పదాన్ని తెరపైకి తెచ్చారు. ఆ పదం ఏమిటంటే… quomodocunquize. రైల్వే శాఖను విమర్శించే క్రమంలో థరూర్ ఈ పదాన్ని ఉపయోగించారు. quomodocunquize అంటే ‘ఏ విధంగానైనా డబ్బు సంపాదించడం’ అని అర్థం. ఆయనే ఆ పదానికి అర్థం కూడా వివరించారు. వృద్ధులకు రైలు ప్రయాణాల్లో రాయితీపై రైల్వేశాఖను ప్రశ్నిస్తూ ఆయన ఈ మేరకు పద ప్రయోగం చేశారు. ఎలాగైనా సరే భారతీయ రైల్వే డబ్బులు సంపాదించాలని భావిస్తోందా? అని ప్రశ్నించారు.

థరూర్ ఈ విధంగా వ్యాఖ్యానించడానికి కారణం ఉంది. ఇటీవల భారత రైల్వే శాఖ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ల ధరలపై రాయితీని పునరుద్ధరించలేమని రైల్వే శాఖ పేర్కొంది. ఇదిలావుంటే, శశి థరూర్ కొత్త పదాన్ని పరిచయం చేసిన నేపథ్యంలో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. తాము పాత పాస్ వర్డ్ లు మార్చేసుకుని, quomodocunquize పదాన్ని కొత్త పాస్ వర్డ్ గా పెట్టుకుంటామని మీమ్స్ తో బదులిచ్చారు.

Leave a Reply

%d bloggers like this: