Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

భారత్ లో ప్రయాణించకుండా సౌదీ వాసులపై ఆంక్షలు!

భారత్ లో ప్రయాణించకుండా సౌదీ వాసులపై ఆంక్షలు!
కరోనా కేసుల పెరుగుదల వల్లేనని ప్రకటన
మరో 15 దేశాలకు వెళ్లడంపైనా ఆంక్షలు
సౌదీకి భారతీయులు వెళ్లడంపై లేని స్పష్టత

సౌదీ జాతీయులు భారత్ లో ప్రయాణించకుండా అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరో 15 దేశాల్లోనూ ప్రయాణించకుండా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, ఆర్మీనియా, బెలారస్, వెనెజులా ఉన్నాయి.

ఆయా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్ పోర్ట్స్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ దేశాలకు వెళ్లేందుకు సౌదీ అరేబియా పౌరులను అక్కడి ప్రభుత్వం అనుమతించదు. అయితే, సౌదీకి భారతీయులు రావడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి మన దేశంలో కరోనా కేసులలో పెరుగుదల ఏమీ లేదు. అవి దాదాపు కనిష్ఠ స్థాయుల్లోనే కొనసాగుతున్నాయి. అస్పష్ట సమాచారం, అవగాహన లోపంతో సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయనేది వాస్తవం కాదని మనవిదేశాంగా శాఖ వర్గాలు స్పష్టం చేసినప్పటికీ సౌదీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఆదేశస్తులు ఇక్కడకు వచ్చినందుకు నిషేధం విధించిన సౌదీ ప్రభుత్వం ,మనదేశం నుంచి సౌదీ వెళ్లేవారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు …

Related posts

ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలతో వచ్చే యాంటీబాడీలపై బ్రిటన్ అధ్యయనం.. సంచలన విషయాల వెల్లడి!

Drukpadam

కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది: ఐఎంఏ

Drukpadam

కరోనా వచ్చి పోయిన ఏడాది తర్వాత కూడా గుండెకు ముప్పు!

Drukpadam

Leave a Comment