Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళ సీఎం స్టాలిన్‌కే క్రేజ్.. ప్రధానిగా రాహుల్ ఓకే అన్న తమిళ ప్రజలు: సి ఓటర్ సర్వే!

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళ సీఎం స్టాలిన్‌కే క్రేజ్.. ప్రధానిగా రాహుల్ ఓకే అన్న తమిళ ప్రజలు: సి ఓటర్ సర్వే!
2021లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో సీఎంకే అత్యధిక ప్రజాదరణ
స్టాలిన్‌కు ఓటేసిన 85 శాతం మంది
ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఓకే అన్న 54 శాతం మంది తమిళులు
మోదీకి అనుకూలంగా 32 శాతం మంది ఓటు

తమిళనాట సీఎం స్టాలిన్ కు తిరుగులేని ఆధిక్యత ఉంది. ఒక్క తమిళనాడులోనే కాదు దక్షణాది రాష్ట్రాలలోని ఆయన నెంబర్ వన్ సీఎం గా ఉన్నారు . అంతేకాదు ప్రధానిగా ఎవరి కావాలని తమిళ ప్రజలను అడిగితె రాహుల్ కె ఓటు వేశారు . ఆయనకు 50 మంది జైకొట్టగా ప్రధాని మోడీకి 30 శాతం మందికి ఓటు వేయడం గమనార్హం ….

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. 2021లో ఎన్నికలు జరిగిన అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ (ఐఏఎన్ఎస్)-సి ఓటర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తున్న స్టాలిన్‌కు అత్యంత ప్రజాదరణ ఉందని ఈ సర్వేలో వెల్లడైంది. మిగిలిన ముఖ్యమంత్రులందరి కంటే అత్యధికంగా 85 శాతం ఆదరణ స్టాలిన్‌కు ఉన్నట్టు తేలింది.

అలాగే, దేశానికి కాబోయే ప్రధాని ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు రాహుల్ గాంధీవైపే తమిళులు మొగ్గుచూపారు. ఆయనకు అనుకూలంగా 54 శాతం మంది మద్దతు తెలిపారు. ప్రస్తుత ప్రధాని మోదీకి 32 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. మోదీ పనితీరు బాగుందని 17 శాతం మంది అంటే, పరవాలేదని 40 శాతం మంది, బాగాలేదని మరో 40 శాతం మంది చెప్పుకొచ్చారు.

ఇక, తమ జీవన ప్రమాణాలు వచ్చే ఏడాది పెరుగుతాయని 45 శాతం ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులే వచ్చే ఏడాది కొనసాగుతాయని 12 శాతం మంది చెబితే, మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని 13 శాతం మంది అన్నారు.

Related posts

ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం న్యూయార్క్..!

Drukpadam

భర్తను ఆన్ లైన్ లో వేలం వేసిన మహా ఇల్లాలు!

Drukpadam

భద్రాచలం వద్ద గోదావరి పై బ్రిడ్జి నిర్మాణం ఎలా జరిగిందో మీకు తెలుసా ….?

Drukpadam

Leave a Comment