Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎంపీ గా గాయత్రీ రవి… తొలిసారి జిల్లా నుంచి బీసీకి రాజ్యసభ!

ఎంపీ గా గాయత్రీ రవి… తొలిసారి జిల్లా నుంచి బీసీకి రాజ్యసభ!
-గాయత్రీ రవి ద్వారా బీసీలకు అరుదైన గౌరవం
-రవికి ఎంపీ ధ్రువీకరణ పత్రం అందజేత
-డబుల్ ధమాకా తో జిల్లాకు కేసీఆర్ ప్రాధాన్యత

 

 

గాయత్రీ రవి అలియాస్ వద్దిరాజు రవిచంద్ర ….నేడు రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన నేత … ఎన్నికల అధికారి రవి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు .అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేశారు .బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి 2 సంవత్సరాల పదవి కాలానికి ఆయన్ను సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు . దీంతో కేసీఆర్ ఆశీస్సులతో రాజ్యసభకు నామినేషన్ వేశారు . ఒక్కరే నామినేషన్ వేయడంతో పరిశీలన అనంతరం గాయత్రీ రవి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. రవి ధ్రువీకరణ పత్రం తీసుకొనే కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ కవిత , ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి ,తాతా మధు , తదితరులు పాల్గొన్నారు .

ఖమ్మం జిల్లా నుంచి ఒక బీసీ నేతను రాజ్యసభకు పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం … గాయత్రీ రవి ద్వారా ఈ అరుదైన గౌరవం జిల్లా బీసీలకు దక్కిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీలు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు . అంతే కాకుండా ఖమ్మం జిల్లాకే చెందిన హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వడం కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది …

కేసీఆర్ కు రుణపడి ఉంటా ….ఎంపీ రవి

 

తనను చట్టసభకు అందునా దేశంలోనే అత్యన్నతమైన పెద్దల సభకు (రాజ్యసభ) పంపడం తన అదృష్టం గా భావిస్తున్నానని ,అందుకు కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు . తనకు చట్టసభకు వెళ్లాలనే బలమైన కోర్కె ఉందని అయితే ఇంత తొందరగా తీరుతుందని అనుకోలేదని అన్నారు .తనకు కేసీఆర్ , కేటీఆర్ లు ఇచ్చిన అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ,పార్టీ నిర్ణయాను సారం నడుచుకుంటానని తెలిపారు . ఖమ్మం జిల్లాలో గతానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఉంటాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేసారు . అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ యస్ కు మంచి ఫలితాలు వస్తాయని అన్నారు . ప్రజల సమస్యలను రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు,రాష్ట్రానికి జరుగుతున్నా అన్యాయాలపై తమ ఎంపీలతో కలిసి కేంద్రం పై వత్తిడి తెస్తామని రవి పేర్కొన్నారు . తన ఎన్నికకు సహకరించిన ప్రతిఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు .

కేసీఆర్ ఇచ్చిన అరుదైన గౌరవం …తాతా మధు

జిల్లాలో కేసీఆర్ బీసీ నేత వద్దిరాజు రవిచంద్ర ను రాజ్యసభ కు పంపడంద్వారా జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వడంతో పటు బీసీ నేతకు ఇవ్వడం బీసీలకు సీఎం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుందని జిల్లా టీఆర్ యస్ అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు . జిల్లాలో అంకిత భావంతో పని చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో మంచిఫలితాలు సంధించి కేసీఆర్ కు కానుకగా ఇస్తామని అన్నారు . అందుకు అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని మధు అన్నారు .

 

 

Related posts

తెలంగాణ కొత్త సచివాలయం కింద మినీ రిజర్వాయర్!

Drukpadam

ఖమ్మం జర్నలిస్టుల కల సాకారం …ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు …

Drukpadam

This couple Quit Their Jobs To Travel The World In A Customized Bus

Drukpadam

Leave a Comment