Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నరహంతకుడు హెటిరో పారధసారథి రెడ్డి …ఆయన కు రాజ్యసభ టికెట్టా…జగ్గారెడ్డి ఫైర్

నరహంతకుడు హెటిరో పారధసారథి రెడ్డి …ఆయన కు రాజ్యసభ టికెట్టా…జగ్గారెడ్డి ఫైర్
హెటిరో పార్థసారథి వెంటపడి.. ఆయన సంగతి చూస్తాం: జగ్గారెడ్డి
హెటిరో పార్థసారథికి రాజ్యసభ టికెట్ ప్రకటించిన కేసీఆర్
కరోనా సమయంలో నరహంతకుడి పాత్ర పోషించారన్న జగ్గారెడ్డి
ప్రజల ప్రాణాలను సొమ్ము చేసుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని ప్రశ్న

ఇటీవల తెలంగాణ రాష్ట్రము నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులను సెలక్ట్ చేసిన కేసీఆర్ కరోనా కాలంలో నరహంతకుడిగా వ్యవహరించిన హెటిరో పార్థసారథికి టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు . కరోనా నుంచి రోగి కోలుకునేందుకు ఉపయోగించే రెమిడీసివియర్ ఇంజక్షన్ లలో వేలకోట్ల రూపాయల కుంభకోణానికి పార్థసారథి రెడ్డి కారకుడైయ్యాడని దుయ్యబట్టారు . కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన చర్యలపై విచారణ జరిపించి అంతూ తేలుస్తామని ఆయన్ను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు .

ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో అధినేత పార్థసారథిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్థసారథి పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కరోనా సమయంలో నరహంతకుడి పాత్ర పోషించిన వ్యక్తి పార్థసారథి అని అన్నారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ల అమ్మకాలలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ ఫార్మా సంస్థ డబ్బులు వాడుకునేందుకు ఆయనను కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటి కుంభకోణాలు జరగవని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదనే కుట్రలో పార్థసారథి కూడా భాగస్వామి అయ్యారని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్థసారథి వెంటపడి, ఆయన సంగతి తేలుస్తామని అన్నారు.

రెమిడిసివిర్ ఒక్కో ఇంజెక్షన్ ను రూ. లక్ష వరకు అమ్మారని చెప్పారు. హెటిరోపై ఐటీ దాడులు జరిగినప్పుడు ఏం జరిగిందనే విషయం కూడా బయటకు రాలేదని.. అప్పుడు బయటపడింది రూ. 500 కోట్లు కాదని, రూ. 10 వేల కోట్లని అన్నారు. ప్రజల ప్రాణాలతో సొమ్ము చేసుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

Related posts

వైసీపీకి మింగుడు పడని నెల్లూరు జిల్లా రాజకీయాలు …!

Drukpadam

శీనన్న నిర్ణయం ఇంకెప్పుడన్న …పొంగులేటి అభిమానులు …!

Drukpadam

తుమ్మలే పెద్ద ద్రోహి …కందాల అనుచరులు ఘాటు వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment