Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

అమెరికాలో 18 ఏళ్ల యువకుడి కాల్పులు.. 18 మంది చిన్నారుల సహా 21 మంది మృత్యువాత!

అమెరికాలో 18 ఏళ్ల యువకుడి కాల్పులు.. 18 మంది చిన్నారుల సహా 21 మంది మృత్యువాత!
మెక్సికన్ సరిహద్దులో ఘటన
హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి ప్రవేశించిన యువకుడు
పోలీసుల కాల్పుల్లో దుండగుడి హతం
2018 తర్వాత అత్యంత ఘోరమైన ఘటన ఇదే

అమెరికాలో గన్ కల్చర్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ..నిత్యం దీనిపై ఎంత నిఘాపెట్టిన దుండగులు కాల్పుల కలకలం సృష్టిస్తూనే ఉన్నారు .ఇటీవలనే న్యూయార్క్ నగరంలో ఒక షాప్ మహల్ లో చొరబడిన దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు . ఇప్పుడు టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన కాల్పుల్లో 21 మరణించగా అందులో 18 మంది విద్యార్థులు కావడం గమనార్హం …స్కూల్ లో కాల్పుల ఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రుల పేరుపెరుగున స్కూల్ దగ్గర వచ్చారు . బిడ్డలను కోల్పోయిన పేరెంట్స్ రోదనలతో ఈ ప్రాంతమంతా శోక సముద్రం ల మారిపోయింది.

 

అమెరికాలోని టెక్సాస్‌లో తుపాకి మరోమారు నిప్పులు కక్కింది. ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన 18 ఏళ్ల యువకుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది చిన్నారులు, ఓ టీచర్ కూడా ఉన్నారు. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డే పట్టణంలోని రోబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులందరూ 11 ఏళ్లలోపు వారేనని అధికారులు తెలిపారు.

 

దుండగుడు కాల్పులు జరిపిన పాఠశాలలో 500 మంది కంటే ఎక్కువమందే చదువుకుంటున్నట్టు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి చొరబడ్డాడని, అతడి వద్ద రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడని గవర్నర్ తెలిపారు.

కాగా, అమెరికాలో 2018 తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన ఘటన ఇదేనని అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో అప్పట్లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్థులు సహా ముగ్గురు టీచర్లు మృతి చెందారు. 2020లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో 19,350 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related posts

పీఎన్‌బీ కుంభకోణం కేసు.. పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ అదృశ్యం…

Drukpadam

సింగరాయకొండలో వైసీపీ నేత దారుణ హత్య …ఉద్రిక్తత మోహరించిన అదనపు బలగాలు..

Drukpadam

వివేకా రెండవ పెళ్లి గురించి ప్రస్తావించిన ఎంపీ అవినాష్

Drukpadam

Leave a Comment