చదివింది బీటెక్..చేశేది చోరీలు…

చదివింది బీటెక్..చేశేది చోరీలు…
విజయనగరం జిల్లా వాసి బాలరాజు అరెస్టు
జల్సాలకు అలవాటు పడిన బాలరాజు
నర్సం పేట లో లక్ష 50 వేల చోరీ …

బీటెక్‌ చదివి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈస్టు జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సుందరయ్యపేట గ్రామానికి చెందిన మేకల బాలరాజు దూరవిద్య ద్వారా బీటెక్‌ పూర్తి చేసి ఎలక్ట్రీషిన్ గా స్ధిరపడ్డాడు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో మద్యం సేవించడంతో పాటు ఇతర జల్సాలకు అలవాటు పడ్డాడు. ఎలక్ర్టీషియన్‌గా వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదన కోసం చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. విజయనగరం ప్రాంతంలో పలుమార్లు చోరీలకు పాల్పడడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలై తిరిగి చోరీలకు పాల్పడేందుకు గత ఫిబ్రవరిలో వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చేరుకున్నాడు. ఫిబ్రవరి 3న నర్సంపేట ప్రాంతానికి చెందిన కరిమిడ్ల సంపత్‌రావు అనే వృద్ధుడు బ్యాంక్‌ నుంచి రూ.1.50 లక్షలను డ్రా చేసి ద్విచక్రవాహనంలో పెట్టుకొని, కిరాణషాపు వద్ద ద్విచక్రవాహనాన్ని నిలుపగా అందులో ఉన్న డబ్బులను బాలరాజు కాజేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఇన్స్‌పెక్టర్‌ పులి రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు ఆధ్వర్యంలో కేసును ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీకి పాల్పడిన రూ.1.50లక్షలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రాంచరణ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

%d bloggers like this: