వైకాపా నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్!

వైకాపా నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్!
-సీఎం జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ నుంచి అనంతబాబు సస్పెన్షన్‌
-అనంతబాబు సస్పెన్షన్‌పై వైకాపా కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల
-డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించిన అనంతబాబు
-హత్య విషయమై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు
-14 రోజుల రిమాండ్ విధించడంతో జైలులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ అధికారిక ప్రకటనలో తెలిపింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంత బాబు నిందితుడని పోలిసుల ప్రాధమిక విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసింది. పోలీసులు కూడా ఆయన హత్య చేసినట్లు నిర్దారించడంతో పార్టీ అధ్యక్షడు సీఎం జగన్ ఆదేశాలం మేరకు పార్టీ నుంచి ఆయన్ను సస్పెండు చేస్తూ వైసీపీ ఒకప్రకటన విడుదల చేశారు .

అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హత్య చేసి దాన్ని ఆక్సిడెంట్ గా నమ్మబలికి ప్రయత్నం చేశారు . అంటే కాకుండా ఆయన కార్ లో ఎక్కించుకొని డ్రైవర్ ఇంటికి మృతదేహాన్ని తీసుకోని వెళ్లి అప్పగించారు . కుటుంబసభ్యులు అడిగితె ప్రమాద వశాత్తు జారీ పడ్డారని తెలపటం అనుమానాలు బలం చేకూర్చింది. కుటంబసభ్యుల కోరిక మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారం జరిపారు . దాంతో కుటుంబ సభ్యుల అనుమానం నిజం కావడం తో పోలీసులు అనంతబాబు అరెస్ట్ చేశారు . జైల్లో ఉన్న అనంతబాబు సీఎం జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు .

Leave a Reply

%d bloggers like this: