ఎంపీగా వద్దిరాజు రాజు రవిచంద్ర ఈనెల 30 న ప్రమాణస్వీకారం !

ఎంపీగా వద్దిరాజు రాజు రవిచంద్ర ఈనెల 30 న ప్రమాణస్వీకారం !
ఢిల్లీకి తరలి వెళ్లనున్న అభిమానులు …
కేసీఆర్ ఆశీస్సులు అందుకున్న రవిచంద్ర
కుటుంబసభ్యులతో ఢిల్లీకి

తెలంగాణ రాష్ట్ర శాసనసభ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవి చంద్ర అను నేను…. అని ప్రమాణ స్వీకారం చేయనున్న రవి… ఆపదం పలికేందుకు ఉవిళ్ళూ ఊరుతున్నారు. . ఎప్పటినుంచే చట్ట సభలకు ఎన్నికకావాలనే తన కోరిక నెరవేరుతున్న వేళ ఆయన ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి ….తనపై సీఎం కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని ,జీవితాంతం కేసీఆర్ కు రుణపడి ఉంటానని, ఆయన చెప్పిన పనిని చేసుకొని పోవడమే తనముందున్న కర్తవ్యం అని పలుమార్లు పేర్కొన్నారు .

వద్దిరాజు రవిచంద్ర ఎంపీగా (రాజ్యసభ ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈనెల 30 న రవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు,. పార్లమెంట్ లోని ఉపరాష్ట్రపతి ,రాజ్యసభ చైర్మన్ అయిన ఎం .వెంకయ్య నాయుడు ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం జరగనున్నది. ఇందుకు రాజ్యసభ సెక్రటేరియట్ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం . పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంలో అయితే సభలోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారు . ఇప్పుడు సమావేశాలు లేనందున చైర్మన్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం జరగనున్నది . ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఢిల్లీకి టీఆర్ యస్ కార్యకర్తలు ,అభిమానులు తరలి వెళ్లనున్నారు . రవి కుటుంబ సభ్యులు సైతం ఢిల్లీ కి బయలుదేరుతున్నారు .

బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు సీఎం కేసీఆర్ గాయత్రీ రవికి అవకాశం కల్పించారు. అనేకం మంది పేర్లు పరిశీలించినప్పటికీ గాయత్రీ రవి వైపే కేసీఆర్ మొగ్గుచూపారు . ప్రజల్లో రవికి ఉన్న ఆదరణ , కలుపుగోలు తనం , పార్టీ నాయకత్వం పట్ల విధేయత , అంకిత భావం , తనకు అప్పగించే పనిచేయాలనే పట్టుదల వెరసి సీఎం కేసీఆర్ దృష్టిలో ఆయనకు మంచి మార్కులు సంపాదించి పెట్టాయి. అందువల్ల విశ్వాస పాత్రుడిగా ఉంటాడనే నమ్మకంతో రవి పేరును కేసీఆర్ ,కేటీఆర్ లు ఇద్దరు అంగీకరించారు. రవి ఎంపీగా ఎన్నికై ఎన్నికల అధికారుల వద్ద సర్టిఫికెట్ తీసుకున్న దగ్గరనుంచి ఆయన్ను అభినందించేందుకు అభిమానులు , పార్టీ నాయకులూ , కార్యకర్తలు హైద్రాబాద్ లోని ఆయన నివాసానికి క్యూకడుతున్నారు.

 

 

 

Leave a Reply

%d bloggers like this: