ఏపీలో టీడీపీ, వైసీపీలకి మేం దూరం: బీజేపీ నేత సునీల్ దేవధర్!

ఏపీలో టీడీపీ, వైసీపీలకి మేం దూరం: బీజేపీ నేత సునీల్ దేవధర్!
ఏపీలో ఇటీవల చర్చనీయాంశంగా పొత్తుల అంశం
టీడీపీ, బీజేపీ మళ్లీ కలుస్తాయంటూ ప్రచారం
ఖండించిన సునీల్ దేవధర్
తమకు జనసేనతో మాత్రమే పొత్తు అని వెల్లడి

ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసలే రాజకీయం రంజుగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారాయి. బీజేపీ తో పొత్తుపై పార్టీలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిపై బీజేపీ తీవ్రంగానే స్పందించింది.తమపార్టీ అధికార వైసీపీకి ,ప్రతిపక్ష టీడీపీ కి దూరంగానే ఉంటుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు .

ఇటీవల కాలంలో ఏపీలో పొత్తుల అంశం విశేషంగా చర్చకు వస్తోంది. టీడీపీ, బీజేపీ మధ్య మైత్రికి జనసేనాని పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ స్పందించారు.

నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో బీజేపీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎవరితో పొత్తు ఉంటుందన్న దానిపై రకరకాలు వార్తలు వస్తున్నాయని వెల్లడించారు. ఏపీలో తమకు జనసేనతో మాత్రమే పొత్తు అని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలకు తాము దూరంగా ఉంటామని వెల్లడించారు. ఈ విషయాన్ని నేతలు కార్యకర్తలకు వివరించాలని సునీల్ దేవధర్ సూచించారు.

Leave a Reply

%d bloggers like this: