వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి గుండెపోటు.. చెన్నై అపోలోకు తరలింపు!

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి గుండెపోటు.. చెన్నై అపోలోకు తరలింపు!

  • ‘జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కోటంరెడ్డి
  • కార్యక్రమంలో ఉండగా గుండెపోటుకు గురైన వైనం
  • ఆసుపత్రిలో కోటంరెడ్డిని పరామర్శించిన మంత్రి కాకాణి

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ‘జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం 47వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఈ రోజు ఉండగా ఆయన గుండెపోటుతో విలవిల్లాడారు.

వెంటనే ఆయనను నెల్లూరులోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు చెన్నై అపోలో ఆసుపత్రికి రెఫర్ చేశారు. నెల్లూరు ఆసుపత్రిలో కోటంరెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

%d bloggers like this: