Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ అభిమానిగా కేసీఆర్ …అరుదైన ఫోటో !

ఎన్టీఆర్‌తో కేసీఆర్‌!… అత్యంత అరుదైన‌ ఫొటో ఇది!

  • మాసిన గెడ్డంతో కూర్చుని ఉన్న ఎన్టీఆర్‌
  • ఎన‌లేని అభిమానంతో ఎన్టీఆర్‌ను చూస్తూ నిలుచున్న కేసీఆర్‌
  • పోస్ట్ చేసిన‌ టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ స‌తీశ్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత‌గా కొన‌సాగుతున్నా.. పూర్వాశ్ర‌మంలో ఆయ‌న టీడీపీ నేతేన‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అప్ప‌టికే సినీ రంగంలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్‌… టీడీపీ పేరిట రాజ‌కీయ రంగ ప్రవేశం చేసే నాటికి ముందే కేసీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీ నేత‌గా ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించినా… టీడీపీలోనే ఆయ‌న‌కు రాజ‌కీయ నేత‌గా గుర్తింపు ద‌క్కింది.

టీడీపీ పేరిట పార్టీ పెట్టిన ఎన్టీఆర్ పిలుపునందుకుని ప‌లు రంగాల‌కు చెందిన వారు ఆ పార్టీలో చేరిపోయారు. ఎన్టీఆర్ అంటే అప్ప‌టికే ఎన‌లేని అభిమానాన్ని పెంచుకున్న‌ కేసీఆర్ కూడా టీడీపీలో చేరిపోయారు.

శ‌నివారం ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌లు. తెలుగు నేల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ను స్మ‌రిస్తూ కార్య‌క్రమాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది నేత‌లు ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది.

అందులో మాసిన గెడ్డంతో ఎన్టీఆర్ కూర్చుని ఉండ‌గా… ఆయ‌న ముందు కాస్తంత వంగుని ఆయ‌న‌ను అభిమానంతో చూస్తూ కేసీఆర్ నిల‌బ‌డ్డారు. కేసీఆర్ యువ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో తీసిన ఫొటో ఇది. టీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ వై స‌తీశ్‌ రెడ్డి ట్విట్ట‌ర్ హ్యాండిల్ మీద ఈ ఫొటో క‌నిపించింది. నిజంగానే ఇది అత్యంత అరుదైన ఫొటోగానే చెప్పాలి.

Related posts

రాజీనామా చేసి దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వు …కేసీఆర్ కు షబ్బీర్ అలీ సలహా!

Drukpadam

ఆరెస్సెస్, బీజేపీ తీరుతో ప్రజాస్వామ్యానికి ముప్పు: జస్టిస్ చంద్రు!

Drukpadam

మే 4న తెలంగాణ‌కు రాహుల్.. రెండు రోజుల ప‌ర్య‌ట‌న ఖ‌రారు!

Drukpadam

Leave a Comment