గ్రూపు రాజ‌కీయాలు స‌హించేది లేదు.. చంద్ర‌బాబు

గ్రూపు రాజ‌కీయాలు స‌హించేది లేదు.. చంద్ర‌బాబు
ఇందుకు ఏ ఒక్క‌రూ మిన‌హాయింపు కాద‌న్నబాబు
పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు టెలీ కాన్ఫ‌రెన్స్‌
వైసీపీని గ‌ద్దె దించేందుకు జ‌నం కసిగా ఉన్నారన్న బాబు
గ్రూపు రాజ‌కీయాల‌తో పార్టీకి న‌ష్ట‌మ‌ని హెచ్చరిక

తెలుగు దేశం పార్టీలో గ్రూపు రాజ‌కీయాల‌ను ఇక‌పై స‌హించేది లేదంటూ ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు అన్నారు. ఈ విష‌యంలో ఏ ఒక్క‌రికి కూడా మిన‌హాయింపు లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం పార్టీ నేత‌ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఎన్నిక‌ల‌కు రెండేళ్లు మాత్ర‌మే గ‌డువు ఉంద‌న్న చంద్ర‌బాబు పార్టీ నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తేనే స‌త్ఫ‌లితాలు వ‌స్తాయ‌ని తెలిపారు. లేకపోతె నష్టపోతామని అన్నారు . ఇది అందరం సమిష్టిగా కష్టపడాలని ప్రజల్లో కసిఉండని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు .

ఇటీవ‌లే ముగిసిన టీడీపీ మ‌హానాడును ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు… అధికారంలో ఉన్న వైసీపీని గ‌ద్దె దించేందుకు పార్టీ శ్రేణుల‌తో పాటు ప్ర‌జ‌లు కూడా క‌సిగా ఉన్నార‌ని తెలిపారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో గ్రూపు రాజ‌కీయాలు పార్టీకి తీర‌ని న‌ష్టం చేస్తాయ‌న్న చంద్ర‌బాబు… ఆ త‌ర‌హా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌రాద‌ని పార్టీ నేత‌ల‌కు సూచించారు. పార్టీ శ్రేయ‌స్సును ప‌క్క‌న‌పెట్టి గ్రూపు రాజ‌కీయాలకు దిగే నేత‌లు ఎవ‌రైనా కూడా స‌హించేది లేద‌ని చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చారు .

Leave a Reply

%d bloggers like this: