ఖమ్మం టీఆర్ యస్ లో గ్రూప్ రాజకీయాలు…సద్దు మణుగుతాయా ? పెద్దవవుతాయా??

ఖమ్మం టీఆర్ యస్ లో గ్రూప్ రాజకీయాలుసద్దు మణుగుతాయా ? పెద్దవవుతాయా??
ఖమ్మం జిల్లా కు అత్యంత ప్రాధ్యాత ఇచ్చిన సీఎం కేసీఆర్
రెండు రాజ్యసభ సీట్లను ఖమ్మం కు
అందరు కలిసి పనిచేయాలని హితవు
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కేసీఆర్ వ్యూహాలు

ఖమ్మం టీఆర్ యస్ లో గ్రూప్ రాజకీయాలు సద్దుమణుగుతాయా ? లేక పెద్దవవుతాయా?? అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశం గా మారింది…. దీనిపై సీఎం కేసీఆర్ ద్రుష్టి సారించారు . అందుకే ఎప్పుడు లేనిది జిల్లా కు రెండు రాజ్యసభ సీట్లు ఇవ్వడం ద్వారా ప్రాధాన్యత ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఒక మంత్రి , నలుగురు ఎంపీ లు , 7 ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. మొదటిసారి నాలుగు ఎంపీలు ఉన్న జిల్లాగా ఖమ్మం నిలిచింది. నలుగురిలో ఇద్దరు లోకసభ కాగా , ఇద్దరు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు . . ఇటీవల తనను కలిసిన జిల్లా ఎంపీలు , శాసనసభ్యులతో మాట్లాడుతూ అందరు కలిసి పనిచేయాలని సీఎం కేసీఆర్ హితబోధ చేశారు . దీంతో ఖమ్మం జిల్లా టీఆర్ యస్ గ్రూప్ రాజకీయాలపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ తో ఉన్నట్లు అర్థం అవుతుంది. అందుకే వారితో జిల్లాలో గ్రూప్ లు లేకుండా కలిసి కట్టుగా పనిచేయాలని గ్రూప్ రాజకీయాలు చేస్తే సహించేది లేదని చెప్పకనే చెప్పారు . అందువల్ల కేసీఆర్ మాటలతో ఖమ్మం జిల్లా టీఆర్ యస్ రాజకీయాలు సద్దుమణుగుతాయా ? లేక పెద్దవవుతాయా అనేది ఆశక్తిగా మారింది.

జిల్లాలో గ్రూపులు లేవు …అందరం కలిసే ఉన్నామని పైకి నాయకులూ చెబుతున్నప్పటికీ ఎవరి మనుసులో ఉన్నది వారికే ఉందనేది జగమెరిగిన సత్యం … మంత్రి పువ్వాడ అజయ్ అందరిని కలుపుకొని పోవాలని ఆ విధంగా జరగటం లేదని ఖమ్మం ప్రజాప్రతినిధుల ఫిర్యాదు … ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉన్న అజయ్ కేవలం తన నియోజకవర్గమైన ఖమ్మం పైనే కేంద్రీకరించారని ఆరోపణలు ఉన్నాయి. మంత్రి మారాలని వారి వాదన… అందరిని కలుపుకొని పోవడంలో మంత్రి వైఫల్యాలను వారు ఎత్తి చూపుతున్నారు .

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు ను అభ్యర్థిగా పెట్టగా ఇప్పుడు జిల్లాకు చెందిన ఇద్దరికీ రాజ్యసభ సీట్లు ఇవ్వడంతో కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారని అర్థం అవుతుంది….వద్దిరాజు రవిచంద్ర , బండి పరధసారథి రెడ్డి లను పెద్దల సభకు ఎంపిక చేసిన కేసీఆర్ ఎంపీ నామ ను వారికీ గైడ్ చేయమని చెప్పారు . కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీలో వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారానికి నామ అంతా తానై వ్యవహరించారు . ఎమ్మెల్సీ తాతా మధు , ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , రేగా కాంతారావు ,రాములు నాయక్ తదితరులు ఈ కార్యక్రమాన్ని హాజరైయ్యారు . టీఆర్ యస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న మధు వద్దిరాజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం లో చురుకుగా వ్యవహరించారు .

గత ఎన్నికల్లో మాజీమంత్రి సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరావు ఓటమి చెందగా , ఖమ్మం నుంచి టీఆర్ యస్ అభ్యర్థిగా పోగుచేసిన పువ్వాడ అజయ్ గెలుపొందారు . ఆయనకు కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కింది. తాను మంత్రి అయ్యేందుకు తనను ఓడించారని తుమ్మల భావన …. తుమ్మల నోటి దురుసుతనం తోనే ఓటమి చెందారని మంత్రి అనుయాయుల వాదన …

ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం లోకసభకు పోటీచేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …టీఆర్ యస్ లో చేరారు ….టీఆర్ యస్ కోసం కస్టపడి పనిచేశారు …. అసెంబ్లీ ఎన్నికల్లో వైరా అభ్యర్థిగా బానోత్ మదన్ లాల్ పోటీ చేశారు . ఆయనకు టికెట్ ఇవ్వద్దని పొంగులేటి పట్టుపట్టినప్పటికీ కేసీఆర్ మదన్ లాల్ వైపే కేసీఆర్ మొగ్గుచూపి టికెట్ ఇచ్చారు . మదన్ లాల్ కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీచేసిన రాములు నాయక్ కు పొంగులేటి అనుచరులు బహిరంగంగానే ప్రచారం చేశారు . దీంతో అధికార టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన మదన్ లాల్ ఓడిపోయి. శ్రీనివాస్ రెడ్డి మద్దతు తెలిపిన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో టీఆర్ యస్ ను జిల్లా ప్రజలు ఆదరించలేదు . రెండు ఎన్నికల్లో కేవలం ఒక్కక్క సీటుకే పరిమితం చేశారు . మొదటి సారి 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీచేసిన జలగం వెంకట్ రావు టీఆర్ యస్ ఉద్యమ ప్రభావం తో పాటు జలగం వెంగళరావు కు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఆయన విజయం సాదించేందుకు సహకరించాయి.

ఇప్పుడు మంత్రిగా ఉన్న అజయ్ కూడా ఖమ్మం నియోజకవర్గం పై గ్రిప్పు సాధించడం ,అధికార పార్టీ అండదండలతో రెండవసారి గెలుపొందగలిగారు . వచ్చే ఎన్నికల్లో టీఆర్ యస్ తిరిగి అధికారంలోకి రావాలంటే జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు టీఆర్ యస్ నేతలు స్వస్తి చెప్పాలి …లేకపోతె అందరి పుట్టి మునిగి కేసీఆర్ ఆగ్రహానికి గురికాకతప్పదు …..నాయకులారా తస్మాత్ జాగ్రత్త …

Leave a Reply

%d bloggers like this: