మిత్రుడికి కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన తుమ్మల నాగేశ్వరరావు!

మిత్రుడికి కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన తుమ్మల నాగేశ్వరరావు!
తొలి నుంచి కూడా తుమ్మల, తుళ్లూరు ప్రసాద్ మంచి మిత్రులు
గుండెపోటుతో మృతి చెందిన ప్రసాద్
పాడె మోసి, కడవరకు సాగనంపిన తుమ్మల

ఆప్త మిత్రుడిని కోల్పోతే ఎవరికైనా ఉండే బాధ అంతా ఇంతా కాదు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిరకాల మిత్రుడు, సత్తుపల్లి మాజీ ఉప సర్పంచ్, మాజీ కౌన్సిలర్ తుళ్లూరు ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో తుమ్మల తన మిత్రుడికి నివాళి అర్పించి, కన్నీటి వీడ్కోలు పలికారు. స్వయంగా పాడె మోసి, కడవరకు సాగనంపారు. అంత్యక్రియలు ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. మిత్రుడితో తనకున్న అనుబంధాన్ని తలుచుకున్నారు. తొలి నుంచి కూడా తుమ్మల, ప్రసాద్ ఇద్దరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు.

తుమ్మల పాడేమోసిన ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. తుమ్మల అంతగా ఎవరికీ స్పందించలేదని అంటున్నారు . ఏంతో కలిసి మెలిసి ఉండే ఆప్తమిత్రుడిని కోల్పయిన భాద ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది.

Leave a Reply

%d bloggers like this: