Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎక్కడ బంగారు తెలంగాణ …ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు…

ఎక్కడ బంగారు తెలంగాణ …ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు…
-ఎక్కడ దళిత ముఖ్యమంత్రి , ఎక్కడ దళితులకు మూడెకరాలు
-వాగ్దానాలకే పరిమితమైన సీఎం కేసీఆర్
-రాష్ట్రంలో రైతులు మరణిస్తుంటే …పొరుగు రాష్ట్రాలకు వెళ్లి రైతులకు పరిహారమా?
-ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన కానరాని అభివృద్ధి…
-ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి

ఎక్కడ బంగారు తెలంగాణ…ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు …. ఎక్కడ దళితులకు మూడెకరాల భూమి , ఎక్కడ దళిత ముఖ్యమంత్రి …. ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన కానరాని అభివృద్ధి… మాటలకే పరిమితమైన టిఆర్ఎస్ ప్రభుత్వం…. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నిరాశా నిస్పృహలు…. . రాష్ట్రంవస్తే బతుకులు బాగుపడతాయన్న అది జరగలేదు …నిధులు ,నీళ్లు ,నియామకాలకోసం ఎదురు చూపులు. నిధులు బాగాఉన్నాయన్నారు కానీ ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వని పరిస్థితి …కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామన్నారు . కానీ వారిని అవుట్ సోర్స్ ఇంగ్ చేశారు . వారికీ ఇస్తున్న వేతనాలు అంతంత మాత్రమే అనే అసంతృప్తి ఉంది. ….

రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో అనేక మలుపులు తిరిగాయి ఉద్యమ నేపథ్యంలో అనేక వాగ్దానాలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి వాటిని తుంగలో తొక్కారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారం రాకముందు ఒక తీరుగా అధికారం వచ్చిన తర్వాత మరోలా కెసిఆర్ ప్రవర్తన ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఉద్యమ పార్టీ కుటుంబ పార్టీగా మారిందనే విమర్శలకు వారు చెప్పే సమాదానాలు సరిపోవడంలేదు . ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం, నిరక్షరాస్యత, వలస కూలీలు వెతలు చూస్తూనే ఉన్నాం . రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు .వైరస్ వచ్చి మిర్చి పంట పాడైపోతే రైతులను ఆదుకున్న దిక్కులేదు .పంటలకు గిట్టుబాటు ధరలపై వాగ్దానాలు మాత్రమే మిగులుతున్నాయి. వడ్లు ఎవరు కొనాలి అనేదానిపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకున్నారు .

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే బంగారు తెలంగాణలో చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు . అందరికీ ఉద్యోగాలు, ఉపాధి హామీ పథకం, నీటి గొడవలు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు . వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి అయిదు సంవత్సరాల కాలం గడిచింది . డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కట్టారు అంటే చెప్పేందుకు కు ప్రభుత్వం సాహసించడం లేదు . గతంలో హైదరాబాద్ లో లక్షకు పైగా ఇళ్లు నిర్మించామని ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది. దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విక్రమార్క ఎక్కడ కట్టారు చూపాలని టిఆర్ఎస్ సర్కార్ నిలదీశారు. దీంతో ఆయనకు లక్ష ఇళ్లు చూపించేందుకు వెంట వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యలోనే జారుకున్నారు .

దళిత బంద్, రైతుబంధు పేర్లతో కెసిఆర్ చేస్తున్న వాటిపై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. బంగారు తెలంగాణ లేదు బతుకు తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎంతసేపటికీ ఎన్నికలు ఓట్లు, ఎలా గెలవాలి అనే అని ధ్యాసలోనే కెసిఆర్ ఉంటున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రజలకు మేలు చేసేందుకు ఏమాత్రం చొరవ చూపడం లేదని ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పంచే డబ్బులకు కాకుండా నిజమైన సేవకులకు ఓట్లు వేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలు ప్రజలు చేస్తున్నారు . రానున్న కాలంలో మరిన్ని ప్రజా పోరాటాలు నిర్వహించడం ద్వారా కెసిఆర్ సర్కారును గద్దె దించాలని అటు బిజెపి ఇటు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలు రాష్ట్రంపై కన్నేశారు. తరచూ పర్యటనలు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు రాష్ట్రంలో పర్యటిస్తూ కెసిఆర్ పాలన పై దుమ్మెత్తిపోస్తున్నారు. ముస్లిం లకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ లు రద్దు చేస్తామని అమిత్ షా కొత్త వివాదానికి తెరలేపారు .

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శల పదును పెట్టింది. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత నెలలో వరంగల్ నగరంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కెసిఆర్ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ఒక ముఖ్యమంత్రిగా కాకుండా రాజుగా వ్యవహరిస్తున్నారని కుటుంబ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మేలు చేస్తామని ,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వాగ్దానాలు చేశారు. తెలంగాణ అమరవీరుల సాక్షిగా వారి కుటుంబాలకు చేయూత నిస్తామని , తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని రాహుల్ గాంధీ సభలో హామీ ఇచ్చారు.

చేసిన వాగ్దానాలు నెరవేరకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుంది. ఇది ఓట్ల రూపంలో ఉంటుందా ఉండదా ? అనేది చెప్పలేము ఎన్నికల నాటికీ ఇచ్చే వాగ్దానాలు , పోటీచేసే వ్యక్తులను బట్టి ఉంటుంది .

Related posts

అంతటికీ కారణం మోదీనే: సీపీఐ రామకృష్ణ…

Drukpadam

పంజాబ్ లో మారుతున్న రాజకీయం.. అమిత్ షాతో భేటీ అయిన అమరీందర్ సింగ్!

Drukpadam

ఏపీపై  బీజేపీ ఫోకస్ …అమిత్ షా,జేపీ నడ్డా రాక

Drukpadam

Leave a Comment