తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మార‌బోతోంది: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మార‌బోతోంది: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!
బీజేపీ అధికారంలోకి వచ్చాక అధికారికంగా విమోచనదినం
తమకు తెలంగాణ‌పై ఎలాంటి వివ‌క్ష లేదన్న అమిత్ షా
ఏ ముఖ్య‌మంత్రి ఢిల్లీకి వ‌చ్చినా గౌర‌విస్తామని స్పష్టీకరణ
2004 నుంచి 2014 వ‌ర‌కు తెలంగాణ డిమాండ్‌ను కాంగ్రెస్ ప‌ట్టించుకోలేదని ఆరోపణ
అన్ని రాష్ట్రాల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్న కేంద్ర మంత్రి

తెలంగాణాలో త్వరలో ప్రభుత్వం మారబోతుంది…ఇది ఎవరో అనామకుడు అన్నమాట కాదు స్వయానా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నమాట …ఢిల్లీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంటే 2023 ఎన్నికల్లో టీఆర్ యస్ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి వస్తుందని లేక ముందుగానే తెలంగాణ ఎమ్మెల్యేల్లో చీలిక వస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇది తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా ఆషామాషిగా వ్యాఖ్యలు చేయరు ప్ర‌భుత్వం మార‌బోతోందని ఆయ‌న వ్యాఖ్యలు చేయడమంటే అందులో గూడార్థం ఉంటుంది.

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్య‌మం జ‌రిగిందన్నారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు తెలంగాణ డిమాండ్‌ను కాంగ్రెస్ ప‌ట్టించుకోలేదని ఆయ‌న విమ‌ర్శించారు. 2014 ఎన్నిక‌ల కోస‌మే తెలంగాణ‌ను హ‌డావిడిగా ప్ర‌క‌టించారని ఆరోపించారు.

అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోదీ స‌ర్కారు క‌ట్టుబ‌డి ఉందన్న అమిత్ షా…తెలంగాణ‌పై ఏనాడూ స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపించ‌లేదన్నారు. త‌మ‌కు తెలంగాణ‌పై ఎలాంటి వివ‌క్ష లేదన్న ఆయ‌న ఏ ముఖ్య‌మంత్రి ఢిల్లీకి వ‌చ్చినా గౌర‌విస్తామ‌ని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగ‌మిస్తుంద‌ని తాము న‌మ్ముతామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అతి త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం మార‌బోతోందని అమిత్ షా చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం స్థానంలో బీజేపీ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ విమోచ‌న దినాన్ని అధికారికంగా నిర్వ‌హిస్తామ‌ని అమిత్ షా ప్ర‌క‌టించారు.

Leave a Reply

%d bloggers like this: