ప్రియాంకకు కూడా కరోనా …ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు వెల్లడి ….

ప్రియాంకకు కూడా కరోనా …ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు వెల్లడి ….
-నిన్న సోనియాకు.. ఈరోజు ప్రియాంకా గాంధీకి కరోనా పాజిటివ్
తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ప్రియాంక వెల్లడి
హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానన్న ప్రియాంక
తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విన్నపం

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఒక్క రోజు వ్యవధిలోనే ఆమె కూతురు ప్రియాంకాగాంధీకి కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో తనకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను కరోనా ప్రొటోకాల్స్ అన్నీ పాటిస్తున్నానని… హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పారు. తనతో ఇటీవల కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

తన తల్లికి కరోనా సోకిందని తెలియగానే నిన్న లక్నోలో ఉన్న ప్రియాంక తన టూర్ ను రద్దు చేసుకుని ఢిల్లీకి వచ్చేశారు. అయితే, తన షెడ్యూల్ ను ఎందుకు అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో లక్నోలో రెండు రోజుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల నుంచి ఆమె వెనక్కి వచ్చేశారు. ఇంతలోనే ఆమెకు కూడా కరోనా నిర్ధారణ అయింది.

Leave a Reply

%d bloggers like this: