Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి …పోలీసులపై ఫైర్!

ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి …పోలీసులపై ఫైర్!
-భుజాల మీద స్టార్లు పెట్టుకోవ‌డం కాదు బుర్ర‌లోకి దిగాలని హితవు
-గ్యాంగ్ రేప్‌పై విప‌క్షాల ఉద్యమం తీవ్ర రూపం
-హోం మంత్రిని క‌లిసేందుకు వెళ్లిన రేణుకా చౌదరి
-అడ్డుకున్న పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేత ఫైర్‌
-వీడియోను ట్విట్ట‌ర్‌లో పెట్టిన టీపీసీసీ

ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి పోలీస్ స్టేషన్ లో తన విశ్వరూపం చూపించారు …. హైద్రాబాద్ లో బాలిక గ్యాంగ్ రేప్ పై హోమ్ మంత్రి మహమ్మూద్ అలీని కలిసేందుకు వెళ్లిన ప్రతినిధి బృందంలో కేంద్ర మాజీమంత్రి రేణుక చౌదరి ఉన్నారు . ఈ సందర్భంగా పోలీసుపై చేసిన తీవ్ర వ్యాఖలు సంచలనంగా మారాయి. ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. గ్యాంగ్ రేప్ పై ప్రతిపక్షాలు పాలక పార్టీ వైఖరిని తప్పుపడుతున్నాయి. అసలు దోషులను వదిలేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై పోలీస్ ల వైఖరిని కూడా తప్పు పడుతున్నాయి.

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలికపై జ‌రిగిన గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌పై విప‌క్షాలు ఉద్య‌మాన్ని తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్ర‌మంలో నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ ఇటు బీజేపీతో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళ‌న‌ల‌కు దిగాయి. ఈ క్ర‌మంలో హోం శాఖ మంత్రి మ‌హ‌మూద్ అలీని క‌లిసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌద‌రి య‌త్నించారు. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఓ పోలీసు ఉన్న‌తాధికారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రేణుకా చౌద‌రి.. పోలీసుల తీరుపై నిప్పులు చెరుగుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భుజాల మీద స్టార్లు పెట్టుకోవ‌డం కాదు బుర్ర‌లోకి దిగాల‌వి అంటూ ఆమె పోలీసు అధికారిపై విరుచుకుప‌డ్డారు. అస‌లు ఏం అనుకుంటున్నావంటూ కూడా ఆమె పోలీసు అధికారిని నిల‌దీశారు. పోలీసు అధికారిపై ఈ స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రేణుకా చౌద‌రికి చెందిన వీడియోను టీపీసీసీనే ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

Related posts

Apple Watch Takes Center Stage Amid iPhone Excitement

Drukpadam

ఏపీకి సంపూర్ణ సహకారం అందిస్తాం: కేంద్రమంత్రి గడ్కరీ!

Drukpadam

షర్మిల వద్దకు వై వీ సుబ్బారెడ్డి రాయబారం…

Drukpadam

Leave a Comment