హైదరాబాద్‌లో మరో ఘటన …. క్యాబ్‌ డ్రైవర్‌ అఘాయిత్యం..

హైదరాబాద్‌లో మరో ఘటన …. క్యాబ్‌ డ్రైవర్‌ అఘాయిత్యం..
-మైనర్ బాలికను నిర్బంధించిన క్యాబ్ డ్రైవర్
-కేసును గోప్యంగా ఉంచుతున్న పోలీసులు
-మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు …

జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం కేసు ఇంకా రగులుతుండగానే.. నగరంలో జరిగిన మరో అరాచకం బయటపడింది. ఓ మైనర్‌ బాలిక(13)ను ఓ క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్‌ చేశాడు. ఆ బాలికను ఓ రాత్రంతా వేరే చోట ఉంచి తిరిగి విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించి సదరు క్యాబ్‌ డ్రైవర్‌ సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటికి రాగా పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఇది నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది . ఈ కేసుకు సంబంధించి విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన వివరాలిలా ఉన్నాయి.పాతనగరం, మొగల్‌పురా పీఎస్‌ పరిధికి చెందిన ఓ బాలిక నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. బాలిక కోసం గాలించిన కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి మొగల్‌పురా పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, మరుసటి రోజే ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. ఆ బాలికను విచారించగా.. లుక్మాన్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ తనను రంగారెడ్డి జిల్లాలోని ఏదో ఊరికి తీసుకెళ్లాడని చెప్పింది. దీంతో మిస్సింగ్‌ కేసును కిడ్నాప్‌ కేసుగా మార్చిన పోలీసులు వెంటనే లుక్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ గ్రామానికి తీసుకెళ్లానని, అక్కడ తనకు తెలిసిన వ్యక్తులు తమకు ఆశ్రయమిచ్చారని పోలీసు విచారణలో లుక్మాన్‌ వెల్లడించాడు. వెంటనే లుక్మాన్‌కు ఆశ్రయమిచ్చిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లడానికి కారణమేంటి, అసలు ఆ రాత్రి కొందుర్గ్‌లో ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు… దీనిపై పూర్తీ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రాష్ట్ర రాజధానిలో వెలుగు చూడటంతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వంగా ఆరోపిస్తున్నాయి.

Leave a Reply

%d bloggers like this: