Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు…తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఇద్దరిపై వేటు ….

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు…తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఇద్దరిపై వేటు ….
-నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లను పార్టీ నుంచి తొలగించిన బీజేపీ హైకమాండ్
-తీవ్రంగా పరిగణించిన బీజేపీ హైకమాండ్
-ఇద్దరి ప్రాథమిక సభ్యత్వాలు రద్దు
-మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు సహించబోమని వెల్లడి
-బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని వ్యాఖ్య
-పౌరులు ఏమతాన్ని అయినా స్వఛ్ఛగా ఎంచుకునే హక్కు

బీజేపీ మొదటిసారిగా మహమ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలు చేసిన ఇద్దరు పార్టీ స్పోక్స్ పర్సన్స్ చర్యలు తీసుకుంది. యూపీ రాష్ట్రంలోని కీలకమైన కాన్పూర్ లో మహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలు హిందూ ముస్లింల మధ్య అల్లర్లకు దారితీశాయి. దీంతో డేమేజ్ ని కంట్రోల్ చేసుకొనే చర్యలకు ఉపక్రమించిన బీజేపీ ఇద్దరిపై వేటు వేసింది.ఇద్దరి పార్టీ ప్రాధమిక సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

మైనారిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ జాతీయ మీడియా ప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్చార్జి నవీన్ జిందాల్ లపై వేటు పడింది. వారిద్దరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ట్విట్టర్ లో మహ్మద్ ప్రవక్తపై స్పందించిన నవీన్ జిందాల్ ను కూడా బీజేపీ హైకమాండ్ ఏమాత్రం ఉపేక్షించలేదు. వారిద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది.

బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని వెల్లడించింది. పౌరులు ఏ మతాన్ని అయినా స్వేచ్ఛగా ఎంచుకునే హక్కు రాజ్యాంగం ద్వారా లభించిందని, దీన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది.

ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో కాన్పూర్ లో ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. కాన్పూర్ లో హింస కూడా చోటుచేసుకుంది. కాన్పూర్ లో ఆగ్రహాశాలు రగులుకుంటున్న సమయంలో ట్విట్టర్ లో మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి నవీన్ జిందాల్ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.

Related posts

అప్పుడు జాతిపితను చంపిన సిద్ధాంతమే.. ఇప్పుడు విద్వేషాన్ని నింపుతోంది: రాహుల్​ గాంధీ!

Drukpadam

ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు దేశంలో ఉన్నాడా?: కేటీఆర్‌

Drukpadam

భట్టి పీపుల్స్ మార్చ్ ఖమ్మం నగరంలోకి గ్రాండ్ ఎంట్రీ …ప్రజల బ్రహ్మరథం…

Drukpadam

Leave a Comment