Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

100 రూపాయల నోట్ పై ఎన్టీఆర్ ఫోటో పెట్టె ప్రతిపాదన ఏది లేదు …ఆర్బీఐ స్పష్టికరణ !

కరెన్సీ నోట్లపై గాంధీజీకి బదులుగా ఇత‌రుల ఫొటోల ముద్ర‌ణ‌పై ఆర్బీఐ మాట ఇదే
-క‌రెన్సీ నోట్ల‌పై కొత్తగా ఠాగూర్‌, క‌లాం ఫొటోలు అంటూ ప్రచారం
-వాటిపై వివ‌ర‌ణ ఇచ్చిన ఆర్బీఐ
-అలాంటి ప్ర‌తిపాదనేది లేద‌ని వెల్ల‌డి

కరెన్సీ నోట్లపైమహాత్మా గాంధీకి బదులుగా రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లో ఫోటోలతో కొత్త కరెన్సీ రాబోతుందని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ దీనిపై వివరణ ఇచ్చింది. అలాంటి తప్రతిపాదనలు ఏవి తమ వద్ద లేవని స్పష్టం చేసింది. నోటు పైన వేరే వ్యక్తులు ఫోటోల ముద్రణ జరగాలంటే దానికి ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ పేర్కొన్నది. ఇప్పటికే అనేక రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు దివంగత నేతలు ఫోటోలతో కరెన్సీ నోట్లను ముద్రించాలని ప్రతిపాదనలు అనేకం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఫోటోతో వంద రూపాయల నోటు పై ముద్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ కుమార్తె బిజెపి నాయకురాలు పురంధరేశ్వరి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యం రిజర్వ్ బ్యాంక్ వివరణ ప్రస్తుతానికి నోట్ల ముద్రణ లో ఎవరి ఫోటోలు లు పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చింది.

క‌రెన్సీ నోట్ల‌పై మ‌హాత్మా గాంధీకి బ‌దులుగా ర‌వీంద్రనాథ్ ఠాగూర్‌, మాజీ రాష్ట్రప‌తి ఏపీజే అబ్దుల్ క‌లాం ఫొటోల‌తో కొత్త క‌రెన్సీ నోట్ల‌ను ముద్రించ‌నున్నట్లుగా వినిపిస్తున్న వార్త‌ల‌పై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌ను జారీ చేసింది. దీనికి సంబంధించి త‌మ వ‌ద్ద ఎలాంటి కొత్త ప్ర‌తిపాద‌న లేద‌ని ఆర్బీఐ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ యోగేశ్ ద‌యాళ్ ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

క‌రెన్సీ నోట్ల‌లో మ‌రిన్ని మేర సెక్యూరిటీ ఫీచ‌ర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెస‌ర్‌, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ స‌హానికి గాంధీ స‌హా ఠాగూర్‌,క‌లాం ఫొటోల‌ను ఆర్బీఐ పంపింద‌ని, కరెన్సీ నోట్ల‌పై గాంధీ ఫొటో స్థానంలో ఠాగూర్‌, క‌లాం ఫొటోల‌ ముద్ర‌ణ‌కు సంబంధించి ఆయ‌న నుంచి నివేదిక కోరింద‌ని కొన్ని మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో వాటిపై వివ‌ర‌ణ ఇచ్చిన యోగేశ్ ద‌యాళ్ ఆ వార్త‌ల‌ను ఖండించారు.

Related posts

కుతుబ్ షాహీపై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్

Ram Narayana

దేశంలో కరోనా ప్రబలుతున్న వేళ ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటన రద్దు!

Drukpadam

రాద్ధాంతం తగదు …వర్షకాలం పంట పూర్తిగా కేంద్రం కొంటుంది …కేంద్ర మంత్రి గోయల్!

Drukpadam

Leave a Comment