Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇరాక్ లో ప్రాచీన నగరం గుర్తింపు……

ఎండిపోయిన జలాశయం కింద బయల్పడిన వేల ఏళ్ల నాటి నగరం
-ఇరాక్ లో ప్రాచీన నగరం గుర్తింపు
-దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
-ఎండిపోయిన టైగ్రిస్ నది
-ఓ జలాశయంలో తవ్వకాలు చేపట్టిన జర్మనీ, కుర్దు పరిశోధకులు
-3,400 ఏళ్ల నాటి నగరం బయల్పడిన వైనం

ఎండిపోయిన జలాశయం కింద బయల్పడిన వేల ఏళ్ల నాటి నగరం ఇరాన్ లోని ఒకనాడు గర్భంలో ఉండటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 1300 నుంచి 1600 బీసీ కాలంనాటి ఈనగరం ఆనవాళ్లు బయటపడటంతో చరిత్రకారులు దానిపై పరిశోధనలు మొదలు పెట్టారు . అనేక యూనివర్సిటీలు ఈనగరం యెక్క చరిత్ర ,సంస్కృతీ గురించి తెలుసుకునేందుకు తవ్వకాలు మొదలు పెట్టేందుకు ఇరాక్ ప్రభుత్వ అనుమతి కోరుతున్నారు .

ఇరాక్ లో ఓ ప్రాచీన నగరం బయల్పడింది. కుర్దుల ప్రాబల్యం ఉండే కెమూన్ ప్రాంతంలో ఓ జలాశయం ఎండిపోగా, అక్కడ ఓ పురాతన నగరం ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. ఇది 3,400 ఏళ్ల నాటి నగరం అని భావిస్తున్నారు. 1550 బీసీ నుంచి 1350 బీసీ వరకు విలసిల్లిన మిట్టానీ సామ్రాజ్యంలో ఈ నగరం కూడా ఒక భాగమై ఉంటుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

ఇరాక్ లో ఇటీవల తీవ్ర క్షామం ఏర్పడింది. వర్షాలు కురవకపోవడంతో టైగ్రిస్ వంటి పెద్ద నది కూడా ఎండిపోయింది. దేశంలోనే అతిపెద్ద జలాశయం కూడా నీరు లేక ఎండిపోయింది. దాంతో జలాశయం అడుగుభాగం బహిర్గతం అయింది. ఇక్కడ జర్మనీ, కుర్దు పురావస్తు పరిశోధకులు తవ్వకాలు చేపట్టగా, కంచు యుగం నాటి నగరం ఆవిష్కృతమైంది.

ఈ పరిశోధనలో జర్మనీ ఫ్రీబర్గ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇవానా పుల్జిజ్ పాల్గొన్నారు. ఈ నగరం టైగ్రిస్ నదిని ఆధారంగా చేసుకుని నిర్మితమైందని వివరించారు. ప్రస్తుతం ఈశాన్య సిరియా భూభాగంలో ఉన్న మిట్టానీ సామ్రాజ్యంతో ఈ భూభాగాన్ని అనుసంధానం చేసే ప్రధాన నగరం ఇదే అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు.

కాగా, ఈ జలాశయంలోకి మళ్లీ నీరు చేరితే, తవ్వకపు పనులకు ఆటంకం కలుగుతుందని, అందుకే ఇప్పటివరకు ఆవిష్కరించిన కట్టడాలకు ప్లాస్టిక్ తొడుగులతో బిగుతుగా కప్పివేస్తున్నామని జర్మనీ వర్సిటీ వెల్లడించింది. ఏదేమైనా, కంచు యుగం నాటి పరిస్థితులు, సంస్కృతిని మరింత తెలుసుకునేందుకు ఈ నగరం ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

Related posts

ప్రపంచంలో బలమైన ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్!

Drukpadam

జ్వరం వచ్చిన వెంటనే మాత్ర వేసేస్తున్నారా?.. అది మంచిది కాదంటున్న వైద్యులు!

Drukpadam

The Internet’s Going Crazy Over This £3.30 Mascara

Drukpadam

Leave a Comment