Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజీనామాకు ససేమీరా అంటున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!

రాజీనామాకు ససేమీరా అంటున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!
-రాజీనామా ప్రసక్తే లేదు.. మిగిలిన రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేస్తానని ధీమా
-ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంక
-అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ ప్రజల ఆందోళన
-పదవీ కాలం పూర్తయ్యేంత వరకు రాజీనామా చేయబోనన్న అధ్యక్షుడు
-ఆ తర్వాత మాత్రం ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టీకరణ

శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు దేశ అధ్యక్షుడు రాజపక్షే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన ససేమిరా అంటున్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. ప్రజలు తిండి కోసం అల్లాడిపోతున్నారు. ఇప్పటికె ఆయిల్ నిల్వలు తగ్గిపోయాయి.వాటి ధర ఆకాశాన్ని అంటుతోంది. నిత్యావసర సరుకులు కూడా దొరకడం కష్టంగా మారింది. ప్రజలు గత కొన్ని నెలలుగా వీధి పోరాటాలు చేస్తున్నారు. గత నెలలో ప్రజల వత్తిడి మేరకు ప్రధాని రాజీనామా చేశారు . ఇప్పుడు దేశాధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయినప్పటికీ ఆయన రాజీనామా విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని మరో రెండేళ్ల తన పదవీ కాలం ఉందని పేర్కొంటున్నారు. తన పదవీకాలం పూర్తి అయిన తర్వాత తిరిగి ఎన్నికల్లో పోటీ చేయబోనని అప్పటివరకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని పేర్కొంటున్నారు . ప్రజలు ఆయన మాటలను లెక్కచేయకుండా వీధి పోరాటాలు చేస్తున్నారు. శ్రీలంకలో జరుగుతున్నా పరిణామాలు ఆర్థిక సంక్షోభంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకలో ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్లే దేశం ఈ దుస్థితి ఎదుర్కొంటోందంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇందుకు కారణమైన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ నిరసనలు జరుగుతున్నాయి. గత నెలలో అధ్యక్షుడి నివాసం వద్ద జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అధ్యక్షుడు గొటబాయ సోదరుడైన ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేశారు. అయితే, అధ్యక్షుడు మాత్రం రాజీనామాకు ససేమిరా అన్నారు.

ప్రజలు మాత్రం ప్రధాని రాజీనామా ఒక్కటే సరిపోదని, అధ్యక్షుడు కూడా రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గొటబాయ రాజపక్స మాట్లాడుతూ.. ప్రజలు తనకు ఐదేళ్లపాటు పాలించమని అధికారం ఇచ్చారని, దానిని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. తనకింకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉందని, అది పూర్తయ్యాక తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు.

Related posts

ప్రజల నుంచి విమర్శలు …మద్యం ధరలు తగ్గించిన ఏపీ సర్కార్

Drukpadam

పదవిలో కొనసాగే నైతిక అర్హత అమిత్ షాకు లేదు…కాంగ్రెస్

Drukpadam

జోడో యాత్రలో రాహుల్ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన!

Drukpadam

Leave a Comment