Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే ల పని తీరుపై ద్రుష్టి పెట్టిన సీఎం జగన్ …175 సీట్లు లక్ష్యంగా పనిచేయాలని హితవు!

ఎమ్మెల్యే ల పని తీరుపై ద్రుష్టి పెట్టిన సీఎం జగన్ …175 సీట్లు లక్ష్యంగా పనిచేయాలని హితవు!
-వైసీపీలో జీరో పెర్ఫార్మెన్స్ ఎమ్మెల్యేలు పట్ల అసంతృప్తి
-వెలుగులోకి ఆరుగురు ఎమ్మెల్యేల‌ పేర్లు
-వెల్ల‌డి కాని మ‌రో ఎమ్మెల్యే పేరు
-జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు
-ఇద్ద‌రు మాజీ మంత్రులూ జీరో పెర్ఫార్మ‌ర్ల

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ దిద్దుబాటు చర్యలు నడుంబిగించింది. మరో రెండు సంవత్సరాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు కర్తవ్య బోధ చేశారు . ఎమ్మెల్యే పనితీరుపై సమిక్షించారు . ఎమ్మెల్యేల గడపగడపకు వైసిపి అనే నినాదంతో చేపట్టిన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన నేతలకు సూచించారు. ఎమ్మెల్యే నెలలో 20 రోజులు ప్రజలతో ఉండాలని సచివాలయాలు సందర్శించాలని ఆయన నిర్దేశించారు. రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయించటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికీ రాష్ట్రంలో కొంత మంది ఎమ్మెల్యేలకు పనితీరు పై ఆయన తనవద్ద ఉన్న నివేదికను గుర్తు చేశారు . ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడం పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఇకనైనా ఎమ్మెల్యేల పనితీరు మారాలని వారు ప్రజలతో మమేకమై ఉండాలని ఆయన సూచించారు. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు 175 సీట్లకుగాను 175 సీట్లు గెలవాలని లక్ష్యంతో ముందుకు సాగాలని ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా లక్ష్యం నెరవేరదని ఆయన స్పష్టం చేశారు . ప్రశాంత్ కిషోర్ స్థానంలో మరో వ్యూహకర్తను నియమించారు. ఆయన నేడు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతో భేటీ అయినట్లు సమాచారం.

ఇటీవ‌లే మొద‌లుపెట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం సమీక్ష జరిపారు . తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జరుగుతున్న ఈ స‌మీక్ష‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు, జిల్లాల అధ్య‌క్షులు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశానికి ముందే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల ప‌నితీరుపై జ‌గ‌న్ నివేదిక తెప్పించుకున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా బుధ‌వారం నాటి స‌మీక్ష‌లో జ‌గ‌న్ ఆ నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టిదాకా కాలు మోప‌ని నేత‌లు ఏడుగురు ఉన్నారంటూ జ‌గ‌న్ చెప్పారు. వీరంతా ఇప్ప‌టిదాకా ఈ కార్య‌క్రమానికే హాజ‌రు కాలేదని చెప్పిన జ‌గ‌న్‌…ఈ ఏడుగురు ఎమ్మెల్యేల‌ను జీరో పెర్ఫార్మెన్స్ క‌లిగిన నేత‌లుగా తేల్చారు.

ఈ జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), ఎన్టీఆర్ జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్, నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి ఉన్న‌ట్లుగా తేలింది. ఇంకో ఎమ్మెల్యే పేరు బ‌య‌ట‌కు రాలేదు. ఈ జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉండ‌టం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రులుగా ప‌నిచేసిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో గమనార్హం .

Related posts

షర్మిల కాంగ్రెస్ లో చేరికపై కాంగ్రెస్ లోనే భిన్న వాదనలు …

Drukpadam

రాహుల్‌, రేవంత్‌ల‌పై జీవ‌న్ రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు!

Drukpadam

కారు పార్టీకి కూసుకుంట్లనే …ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులందరూ ఒకే సామాజికవర్గం !

Drukpadam

Leave a Comment