ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం!

ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం!
అవినీతి పాలన అన్న జెపి నడ్డా
అసమర్థ పాలన అన్న సంతోష్
సోమువీర్రాజు వ్యవహారంపై వైసీపీ ఫైర్
నడ్డా ఏపీలో జరుగుతున్నా కార్యక్రమాలు తెలుసుకొని మాట్లాడలేదన్న రోజా
బీజేపీ వ్యవహార శైలిపై భగ్గుమంటున్న వైసీపీ ….

వైసిపి బీజేపీల మధ్య సఖ్యత ఉందని అనుకుంటున్నా వేళ… ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం ఆశక్తిగా మారింది. ఇరు పార్టీలు ఒకరికొకరు సహకరించు కుంటున్నారని ,అటు కేంద్రంలో బీజేపీని వైసిపి సమర్దిస్తుందని చప్పుకుంటున్న సందర్భంలో ఈ మాటల యుద్ధం ఇరుపార్టీలకు ఇబ్బందిగా మారె అవకాశం ఉందనే అభిప్రాయాలూ వ్యక్తం ఆవుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బిజెపి అభ్యర్థి కి వైసీపీ మద్దతు ప్రకటించిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో వైసీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయపండితుల అభిప్రాయం. ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వం పై జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం పర్చేందుకు చేసిన విమర్శలు అనుకుంటే పర్వాలేదు కానీ ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అవినీతి ముద్ర వేశారు . బిజెపి జాతీయ అధ్యక్షుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోకుండానే మాట్లాడారని వైసిపి కి చెందిన మంత్రి రోజా తీరుపై మండిపడ్డారు. అంబటి రాంబాబు సైతం బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీజేపీకి రాష్ట్రంలో ఉనికి కోసం పాటు పడుతుందని వైసిపి ఆరోపిస్తోంది. అయితే జాతీయస్థాయిలో ముఖ్యంగా ప్రధాని వద్ద జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నప్పటికీ బీజేపీ నేతలు రాష్ట్రంలో వైసిపి జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించడం వైసీపీకి రుచించని అంశమే .. అందువల్ల బీజేపీ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ స్థాయిలో కేంద్రప్రభుత్వం సూచనలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని చులకన చేసి మాట్లాడటం పై వైసిపి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైన వేళ వైసీపీ పై అనుచిత వ్యాఖ్యలు విమర్శలు చేయడం ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ వ్యవహారశైలి ఇలానే కొనసాగితే రానున్న కాలంలో ఇబ్బంది ఏర్పడుతుందనే అభిప్రాయంతో వైసిపి ఉంది. ఆ పార్టీ జాతీయ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ సంతోష్ కూడా వైసిపిని తప్పు పట్టే విధంగా విమర్శలు చేయడం పై వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీజేపీకి తగునా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని మోడీని కలిసిన కొద్దిరోజులకే బిజెపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దాడికి పూనుకొనడం చర్చనీయాంశంగా మారింది….

Leave a Reply

%d bloggers like this: