కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు … రాహుల్ గాంధీ పాదయాత్రకు రోడ్ మ్యాప్ …

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు … రాహుల్ గాంధీ పాదయాత్రకు రోడ్ మ్యాప్ …
అక్టోబరు 2 నుంచి దేశవ్యాప్త పాదయాత్ర
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే చర్యలకు రాహుల్ రెడీ
కన్యాకుమారి నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న రాహుల్ గాంధీ
ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర
రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్న టీఎన్‌సీసీ

రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అందుకు గాంధీ జయంతి అక్టోబర్ 2 ను ఎంచుకున్నారు . పాదయాత్ర చేయడం ద్వారా దేశ ప్రజలకు ఒక సందేశాన్ని అందించాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ తో సిద్ధమవుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్ర తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగనుంది. ప్రజలను అతిదగ్గరగా కలుసుకోవడంతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలను వివరించనున్నారు . బీజేపీ వల్ల దేశంలో చేటు చేసుకుంటున్న మతకలహాలు , కులమత వైషమ్యాలు వలన అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో జరిగిన జరిగిన చింతన్ శిబిర్ లో సుదీర్ఘంగా చర్చించారు . అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు చేయాలని నిర్ణయించింది. ముందుగా కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలతో పాదయాత్ర జరపాలని నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ యాత్రను దేశవ్యాప్తంగా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో స్థానిక నాయకులు పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు జరుపుతున్నారు . స్థానికంగా నాయకులూ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ అభినందించింది. కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు శివ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. గతంలో 2003 లో ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ తిరిగి అధికారం చేపట్టగలిగారు . మొదట పాదయాత్రలు ముందు వద్దని భావించిన కాంగ్రెస్ పార్టీ తాము ఎక్కడ నష్టపోతున్నమౌ గ్రహించింది. అందువల్ల వివిధ రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ మంది నాయకులను పాదయాత్రలు చేసి ప్రజలకు దగ్గర కావాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టేందుకు నాయకులు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన సొంత నియోజకవర్గమైన మధిరలో పాదయాత్ర చేపట్టారు. ఇది మంచిఫలితాలు ఇస్తుందని ఫీడ్ బ్యాక్ … ఇప్పటికీ రెండు పర్యాయాలు పాదయాత్ర చేసినభట్టి మూడో పర్యాయం కోసం సన్నద్ధమవుతున్నారు.భట్టి పాదయాత్రను సోనియా ,రాహుల్ లు అభినందించారు . నిరంతరం ప్రజలకు దగ్గర అవడం ద్వారానే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే పాదయాత్రను ప్రతి జిల్లాలో కనీసం 75 కి.మీ ఉండాలని రోడ్ మ్యాప్ తయారు చేశారు. ఇందుకుగాను ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు .మొదటగా తమిళనాడులో ప్రారంభమయ్యే ఈ యాత్ర కు ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రోడ్ మ్యాప్ ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. చూద్దాం రాహుల్ గాంధీ రోడ్ మ్యాప్ పాదయాత్ర ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వవైభవం తెస్తుందో చూద్దాం…

Leave a Reply

%d bloggers like this: