Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే మీరు లాగేసుకుంటారా ?: సీఎల్పీ నేత భట్టి

కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే మీరు లాగేసుకుంటారా ?: సీఎల్పీ నేత భట్టి
ఇదేనా బంగారు తెలంగాణ …ఇదేనా మనరాష్ట్రం ,మన పాలన
కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన భూములతో రియల్ వ్యాపారమా?
ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తాయా? రియల్ వ్యాపారం కోసమా?
అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ ను అమలు చేస్తాం
శీలం సిద్ధారెడ్డి ఆశయాలు నిజం చేయడమే మనం ఇచ్చే నిజమైన నివాళి
సీఎల్పీ నేత భట్టి మూడవ దశ ప్యూపిల్స్ మార్చ్ మీనవోలు నుంచి ప్రారంభం …

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భూములు ఇస్తే మీరు లాగేసుకుంటారా ? ఇదేనా బంగారు తెలంగాణ , ఇదేనా ధనిక రాష్ట్రం, ఇదేనా మనరాష్ట్రం మనపాలన అంటూ టీఆర్ యస్ ప్రభుత్వ విధానాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు . తన సొంత నియోజకరవర్గమైన మధిరలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడవదశలో భాగంగా ఎర్రుపాలెం మండలం మీనవోలు నుంచి గురువారం పాదయాత్ర ప్రారంభించాచారు . ఈ సందర్భంగా టీఆర్ యస్ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు . కాంగ్రెస్ అధికారంలో ఉండగా పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు, అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుంటే సమరం తప్పదని హెచ్చరించారు.

 

అంతకు ముందు మీనవోలు అంకమ్మ దేవాలయంలో భట్టి దంపతులు పూజలు నిర్వహించారు అనంతరం తక్కెళ్ళపాడు, సఖినవీడు, మొలుగుమాడు, ఇనగలి గ్రామాల్లో పాదయాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు మూడెకరాల భూమి, ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న నెరవేర్చడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన టిఆర్ఎస్ పాలకులు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలు సాగు చేసుకుని జీవనోపాధి పొందాలన్న ఉద్దేశంతో పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇప్పటికే రైతు వేదికలు, స్మశాన వాటికలు, నర్సరీల ఏర్పాటు పేరిట ప్రజల నుంచి బలవంతంగా లాక్కోవడంపై మండిపడ్డారు . “ఎర్రుపాలెం మండలం తక్కెళ్ళపాడు గ్రామం వేదిక నుండి
ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరిస్తున్న పేదల భూములు తీసుకోకుండా వెంటనే మీరు అధికారులకు ఆదేశాలు జారీ చేయండి. ప్రభుత్వం పేదల భూములను బలవంతంగా తీసుకుంటే బాధితుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ డిక్లరేషన్ అమలు

వ్యవసాయ సంక్షేమం కోసం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే నూరుశాతం అమలు చేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణ మాఫీ, వరికి మద్దతుధర, అధికంగా వెయ్యి రూపాయలు బోనస్, పత్తి, మిర్చి, పెసర, మినుము ఇతర పంటలకు బోనస్ ఇవ్వడంతో పాటు నకిలీ విత్తానాల అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి నిందితులు ఎవరైనా వదిలిపెట్టకుండా శిక్షిస్తామని వెల్లడించారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామన్నారు. రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి రూ. 15వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగి ఉన్న రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

సిద్ధారెడ్డి ఆశయాలు నెరవేర్చడమే మనం ఇచ్చే నిజమైన నివాళి

 

మాజీ మంత్రి స్వర్గీయ శీలం సిద్ధారెడ్డి ఆశయాలు నెరవేర్చడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా తక్కెళ్ళపాడు లో ఏర్పాటుచేసిన శీలం సిద్ధారెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
నీటి పారుదల శాఖ మంత్రి గా పని చేసి అభివృద్ధికి ప్రణాళికలు వేసిన జిల్లా తొలి మంత్రి స్వర్గీయులు శీలం సిద్ధా రెడ్డి గారి విగ్రహాన్ని ప్రారంభించడం చాలా గర్వంగా ఉందన్నారు.
ఖమ్మం జిల్లాలో వ్యవసాయం, విద్య , వైద్యం అభివృద్ధికి సిద్ధారెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, స్థానిక
సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ వీరభద్రం, జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, పాదయాత్ర కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

హైదరాబాదులో బొత్స కుమారుడు సందీప్ నిశ్చితార్థం… తరలి వచ్చిన నేతలు, టాలీవుడ్ తారలు!

Drukpadam

పార్లమెంటులో చట్టాలను రద్దు చేసేంతవరకు.. సరిహద్దుల నుంచి కదిలేది లేదంటున్న రైతులు

Drukpadam

మేడారం జాతరకు హెలికాఫ్టర్ …

Drukpadam

Leave a Comment