రాష్ట్రపతి రేసులో ఆరడజన్ పైగా పేర్లు …తమిళశై సౌందరరాజన్ పేరుకూడా…

రాష్ట్రపతి రేసులో ఆరడజన్ పైగా పేర్లు …తమిళశై సౌందరరాజన్ పేరుకూడా…
-ద్రౌపతి ముర్ము ,అనసూయ , ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ,వెంకయ్య నాయుడు పేర్ల పరిశీలన
-ప్రతిపక్షాల అభ్యర్థులుగామీరా కుమార్ , శరద్ పవర్
-దక్షణాది ,ఉత్తరాది అనే కోణంలో పరిశీలన
-మైనార్టీ కోటాలో బలంగా వినిపిస్తున్న పేరు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ షడ్యూల్ విడుదల అయింది… ఈ నెల 15 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు . ఎన్నిక జులై 18 న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జులై 21 న జరుగుతుందని ఎన్నిక ప్రధాన అధికారి ప్రకటించారు . అయితే పాలక పక్షం గాని,ప్రతిపక్షాలు గాని ఇంతవరకు రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. దీంతో ఎవరిని బరిలోకి దింపుతారు కావబోయే రాష్ట్రపతి ఎవరు అనే ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతానికి మైనార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తే కేరళ గవర్నర్ గా పనిచేస్తున్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బెస్ట్ చాయిస్ గా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు . మైనార్టీ కాకపోతే ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ద్రౌపది ముర్ము , లేదా అనసూయ పేర్లు వినిపిస్తున్నాయి.

ఉత్తరాది దక్షిణది అనే తేడా చుస్తే ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు లేదా తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళశై సౌందర్య రాజన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా , కేంద్రమంత్రిగా , ఉపరాష్ట్రపతిగా సేవలు అందించారు . దక్షిణాదికి చెందిన కీలక నేతగా ఉన్నారు . అయితే తమిళశై సౌందరరాజన్ బలహీనవర్గాలకు చెందిన మహిళా నాయకురాలు , తెలంగాణ గవర్నర్ గా తన శక్తిని నిరూపించుకున్నారు . పార్టీకి విధేయురాలు అనే పేరు ఉంది. అస్సోమ్ గవర్నర్ జగదీష్ ముఖి పేరు కూడా పరిశీలనాలి ఉందని సమాచారం . అయితే వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారా ? లేక ఇప్పటివరకు పరిశీలనలోలేని కొత్త వ్యక్తిని రంగంలోకి దించుతారా? అనేదానిపై ఆశక్తి నెలకొన్నది .

ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే రాజకీయ కురువృద్ధుడు ఎన్సీపీ నేత శరద్ పవర్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు చెందిన లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పేరుకూడా పరిశీలనాలి ఉంది . ప్రతిపక్షాలకు కూడా మంచి ఓటింగ్ ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంత తేలిగ్గా రాష్ట్రపతి ఎన్నికను తీసుకోదు …అందువల్ల ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గెలిచే ఛాన్స్ తక్కువగా ఉంది. ఓడిపోయే దానికి శరద్ పవర్ ఆశక్తి చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి. పైగా ప్రతిపక్షాలు అన్ని ఐక్యతగా లేవు .ఎవరిదారి వారిదిగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ,ఒడిశా సీఎం లు బీజేపీ కి మద్దతు ఇవ్వనున్నారు . అందువల్ల ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎవరి చేసిన ఓటమి తప్పదనే అభిప్రాయాలూ ఉన్నాయి. అందువల్ల ఎవరిని అభ్యర్థిగా పెడతాయనేది చూడాలి మరి !

Leave a Reply

%d bloggers like this: