మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీ, యూపీ, కోల్ కతాల్లో భారీ నిరసనలు.. 

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఢిల్లీ, యూపీ, కోల్ కతాల్లో భారీ నిరసనలు.. 

  • ఢిల్లీ జామా మసీదు ముందు భారీగా ముస్లింల నిరసన
  • శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఆందోళనలు
  • తమకు సంబంధం లేదన్న జామా మసీదు ఇమామ్

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇవాళ శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ముస్లింలు మసీదుల వద్ద భారీ నిరసన చేపట్టారు. ఢిల్లీలోని జామా మసీదు, యూపీ సహరన్ పూర్, కోల్ కతాల్లోని మసీదుల వద్ద ఆందోళన నిర్వహించారు. 

అయితే, నిరసనలకు తాము ఎలాంటి పిలుపునివ్వలేదని జామా మసీదు షాహీ ఇమామ్ తెలిపారు. నిన్న చాలా మంది నిరసనలకు ప్రణాళిక సిద్ధం చేసినా అలాంటివేవీ వద్దని వారించామన్నారు. ఇప్పుడు నిరసన చేస్తున్న వాళ్లెవరో తమకు తెలియదని చెప్పారు. వాళ్లంతా ఎంఐఎం, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన అనుచరులని అనుకుంటున్నామన్నారు. 

వాళ్లు నిరసన చేయదలచుకుంటే చేసుకోవచ్చని, వాటికి తాము ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతివ్వబోమని షాహీ ఇమామ్ తేల్చి చెప్పారు. అయితే, పోలీసులు మాత్రం నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగానే ఆందోళన చేపట్టారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించారు.

Leave a Reply

%d bloggers like this: