గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయిలాండ్ రికార్డు!

గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయిలాండ్ రికార్డు!
-గంజాయి సాగు, వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు ప్రకటన
-బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడంపై మాత్రం నిషేధం
-వైద్య పరమైన ఉపయోగాల కోసమే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం
-ఇప్పటికే ఈ కేసుల్లో అరెస్ట్ అయిన నాలుగు వేల మందిని విడుదల చేయనున్న ప్రభుత్వం

గంజాయి సాగు అనేది నేరం …ప్రపంచంలో అనేక దేశాల్లో దీని సాగును నిషేదించారు …గంజాయి సాగు,రవాణా వాడటం చేస్తే శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయి. అలంటి గంజాయిని సాగుచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది థాయిలాండ్ దేశం . ఆసియాఖండంలోని దేశం థాయిలాండ్ తీసుకున్న సంచలన నిర్ణయం ప్రపంచాన్ని ఒక్కసారిగా నివ్వెరపటుకు గురిచేసింది. గంజాయి సాగు, దాని వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు నిన్న ప్రకటించింది. ఫలితంగా గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా రికార్డులకెక్కింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. దీనివల్ల మాఫియా సంస్కృతి పెరిగే అవకాశం ఉందని ఒకపక్క ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ అక్కడ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేరప్రవృత్తి పెరిగే అవకాశం ఉండనే విమర్శలు ఉన్నాయి.

అయితే, గంజాయిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని మాత్రం నిషేధించారు. దీనిని ఉల్లంఘించిన వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, గంజాయి ఇప్పుడు చట్టబద్ధం కావడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన దాదాపు 4 వేల మందిని ప్రభుత్వం విడుదల చేయనుంది.

వైద్య పరమైన ఉపయోగాల కోసమే గంజాయిని చట్టబద్ధం చేసే నిర్ణయం తీసుకున్నట్టు థాయిలాండ్ ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, నేటి నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేయాలని ఆ దేశ మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ నిర్ణయించారు. థాయిలాండ్ నిర్ణయాన్ని పొరుగుదేశాల్లో తప్పుపడుతున్నాయి. ఇప్పటివరకు నిషేధించబడిన గంజాయి బహిరంగ ప్రదేశాల్లో అమ్ముతుండటం సాగు చట్టబద్దం చేయడంతో ఇక దాన్ని వినియోగించే వారి సంఖ్యా కూడా పెరగటం ఖాయమని అంటున్నారు విమర్శకులు …

Leave a Reply

%d bloggers like this: